టీచర్లు మెడికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి: విద్యాధికారిణి రేణుకాదేవి

టీచర్లు మెడికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి: విద్యాధికారిణి రేణుకాదేవి

వికారాబాద్, వెలుగు:  జిల్లాలో బదిలీ కొరకు అప్లై చేసుకున్న టీచర్లు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తాండూరులోని జిల్లా మెడికల్ బోర్డులో హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. 

అనంతరం మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. ఎస్ఏ, ఎస్ జీటీ, ఎల్ పీ, పీఈటీ, పీఎహెచ్ఎం ఉపాధ్యాయులు 01-09-2023 నుంచి 01-06-2024 వరకు ప్రిఫరెన్షియల్ కేటగిరి, మెడికల్ కేటగిరిలో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.