పాక్తో మ్యాచ్కు టీమిండియా రెడీ

పాక్తో మ్యాచ్కు టీమిండియా రెడీ

మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఈనెల 23న పాకిస్తాన్‌‌‌‌తో ఆడే తొలి మ్యాచ్‌‌‌‌కు తమ తుది జట్టు కూర్పు ఖరారైందని టీమిండియా కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ చెప్పాడు. శనివారం జరిగిన కెప్లెన్ల మీటింగ్​లో రోహిత్​ మాట్లాడాడు.  ‘ఆఖరి నిమిషాల్లో తీసుకునే నిర్ణయాలు,  చేసే మార్పులను నేను నమ్మను. టీమ్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ గురించి ముందే ప్లేయర్లకు చెబితే.. వాళ్లు కూడా బాగా ప్రిపేర్‌‌‌‌ అయ్యి ఉంటారు. అందుకే పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌కు ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ను డిసైడ్‌‌‌‌ చేశాం.

ఈ విషయాన్ని ప్లేయర్లకు కూడా చెప్పేశాం. అయితే ప్రతిసారి పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ గురించి పదేపదే చర్చ అవసరం లేదు. ఇప్పటికే ఆసియా కప్‌‌‌‌లో ఆడాం. ఈ పోరును కూడా కేవలం మ్యాచ్‌‌‌‌గానే పరిగణిస్తాం’ అని రోహిత్‌‌‌‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం అన్ని జట్లు భయం లేకుండా ఆడుతున్నాయని, తాము కూడా అదే తీరుతో వెళ్తామన్నాడు.