ఇండియా తొలి మోటార్‌‌‌‌ స్పోర్ట్ టీమ్ గా ఇండి రేసింగ్

ఇండియా తొలి మోటార్‌‌‌‌ స్పోర్ట్ టీమ్ గా ఇండి రేసింగ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఇండియాలో మోటార్ రేసింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.  ఇంటర్నేషనల్ మోటార్‌‌‌‌ సైకిల్‌‌‌‌ సమాఖ్య (ఎఫ్‌‌‌‌ఐఎం)  నిర్వహించే రేసింగ్ ఈ- ఎక్స్‌‌‌‌ప్లోరర్‌‌‌‌లో తొలిసారి ఇండియా టీమ్ పోటీపడనుంది. ఎలక్ట్రిక్‌‌‌‌ మోటార్‌‌‌‌ సైకిల్‌‌‌‌ రేసింగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌కు చెందిన కంకణాల స్పోర్ట్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఈ జట్టును ప్రవేశ పెట్టింది.

దీనికి 'ఇండి రేసింగ్' అని పేరు పెట్టినట్టు గురువారం హైదరాబాద్‌‌‌‌లో జరిగిన మీడియా సమావేశంలో కంకణాల స్పోర్ట్స్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఓనర్ అభిషేక్‌‌‌‌ రెడ్డి కంకణాల ప్రకటించారు. ఎఫ్‌‌‌‌ఐఎం ఈ ఎక్స్‌‌‌‌ప్లోరర్‌‌‌‌ సీజన్‌‌‌‌2లో ఇది పదో జట్టుగా బరిలోకి దిగనుంది. ఈ ఏడాది రేసింగ్‌‌‌‌ సీజన్‌‌‌‌ 2 ఫిబ్రవరి నుంచి ఆరంభం కానుంది. జపాన్‌‌‌‌, నార్వే, ఫ్రాన్స్‌‌‌‌, స్విట్జర్లాండ్‌‌‌‌లో తొలి నాలుగు రేసులు జరుగుతాయి. ఈ సీజన్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌కు ఏడాది చివర్లో ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది.

దీన్ని హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని అభిషేక్ చెప్పారు. ఇండియాలో రేసులు నిర్వహించేందుకు ఎఫ్‌‌‌‌ఐఎంతో తొమ్మిదేండ్ల  ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌‌‌‌ఐఎం- ఈ ఎక్స్‌‌‌‌ప్లోరర్‌‌‌‌ సహ వ్యవస్థాపకురాలు కేరిన్‌‌‌‌ ముంటెతో, మాజీ వరల్డ్‌‌‌‌ చాంపియన్స్, ఇండి రేసింగ్ టీమ్ రైడర్స్ ఐశ్వర్య, శాండ్ర గోమెజ్‌‌‌‌  పాల్గొన్నారు.