ఆసీస్పై విజయంతో చరిత్ర సృష్టించిన రోహిత్ సేన

ఆసీస్పై విజయంతో చరిత్ర సృష్టించిన రోహిత్ సేన

టీమిండియా చరిత్ర సృష్టించింది. ఆసీస్తో జరిగిన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా పాక్ రికార్డును బద్దలు కొట్టింది. ఒక కాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. 2022లో భారత జట్టు..ఇప్పటి వరకు 21 విజయాలను సాధించింది. 

వరుసగా సిరీస్ విజయాలు..


ఈ ఏడాది ఫిబ్రవరిలో విండీస్తో టీ20 సిరీస్ ఆడిన టీమిండియా..3–0తో విజయం సాధించింది. ఆ తర్వాత లంకతోనూ మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం జూన్లో సౌతాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచుల సిరీస్ లో 2–2తో సమంగా నిలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.  జులైలో ఇంగ్లాండ్పై 2–1తో గెలిచింది. ఆగస్టులో వెస్టిండీస్పై ఐదు మ్యాచ్ల సిరీస్ను 4–1తో దక్కించుకుంది. ఆ తర్వాత ఆసియాకప్లో పాక్, హాంకాంగ్పై గెలిచింది. తాజాగా ఆసీస్ పై 2–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో మొత్తంగా 21 విజయాలతో చరిత్ర సృష్టించింది. 

పాక్ రికార్డు బద్దలు..


2021లో  టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఓటమిపాలైంది. ఆ తర్వాత లోపాలను సవరించుకుని ఈ ఏడాది బరిలోకి దిగి విజయాల బాటలో పయనిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు 21 టీ20ల్లో గెలిచిన భారత జట్టు.. ఒక క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక టీ20 మ్యాచ్లు గెలిచిన జట్టుగా పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది.  పాకిస్థాన్ 2021లో 20 విజయాలు సాధించింది. 2018లోనూ పాకిస్థాన్ 17 టీ20ల్లో గెలిచింది. 2016లో ఉగాండా 16 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక 2021లో సౌతాఫ్రికా 15 విజయాలను సొంతం చేసుకుంది. 

రోహిత్ రికార్డు..
జట్టుగా 21 విజయాలతో  టీమిండియా సాధించి రికార్డు సృష్టిస్తే..కెప్టెన్గా రోహిత్ శర్మ కూడా రికార్డులకెక్కాడు. టీ20లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్గా  రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 42 విజయాలతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఉప్పల్ లో సాధించిన విజయం రోహిత్ శర్మకు కెప్టెన్గా 33వ విజయం. దీంతో 32 విజయాలతో ఉన్న కోహ్లీ రికార్డును రోహిత్ బద్దలుకొట్టాడు. అంతేకాకుండా 2021 నుంచి భారత్ ఛేజింగ్ చేసిన 14 మ్యాచుల్లో 13 సార్లు నెగ్గింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది.