రిషబ్‌దే కీలక పాత్ర

రిషబ్‌దే కీలక పాత్ర

బెంగళూరు: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌లో వికెట్‌‌ కీపర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ చాలా కీలకమని టీమిండియా హెడ్​ కోచ్‌‌ రాహుల్‌‌ ద్రవిడ్‌‌ అన్నాడు. తమ ప్లానింగ్​లో అతనిదే పెద్ద పాత్ర అని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టీ20ల్లో పంత్‌‌ కేవలం 58 రన్సే చేశాడు. దీంతో అతని ఫామ్‌‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌‌.. టీమిండియాలో పంత్‌‌ చోటుపై స్పష్టత ఇచ్చాడు. ‘షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో పంత్‌‌ ప్లేస్‌‌ ఎక్కడికీ పోదు. వ్యక్తిగతంగా అతను మరికొన్ని రన్స్‌‌ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కలిసిరాలేదు. అయితే రాబోయే కొద్ది నెలలో ముందుకు సాగే మా ప్రణాళికల్లో అతనిది చాలా పెద్ద పాత్ర. ఈ ఒక్క సిరీస్‌‌తోనే పంత్‌‌ బ్యాటింగ్‌‌, కెప్టెన్సీని అంచనా వేయకూడదు. ఈ విషయంలో నేను చాలా కచ్చితంగా ఉంటాను. అని ద్రవిడ్‌‌ పేర్కొన్నాడు. వెటరన్‌‌ వికెట్‌‌ కీపర్‌‌ దినేశ్‌‌ కార్తీక్‌‌ రాకతో వరల్డ్​కప్​లో  తమకు ప్రత్యామ్నాయాలు చాలా పెరిగాయన్నాడు. డెత్‌‌ ఓవర్స్‌‌లో కార్తీక్‌‌, హార్దిక్‌‌ పాండ్యా అద్భుతమైన ఫినిషర్లని కొనియాడాడు. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌ ముగిసే టైమ్​కు టీ20 వరల్డ్‌‌ కప్‌‌ కోర్‌‌ గ్రూప్‌‌ను గుర్తించాల్సి ఉందన్నాడు.