
దుబాయ్: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఆదివారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో మొదటి నెట్ సెషన్‌లో పాల్గొంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మొదలు యంగ్‌స్టర్ హర్షిత్ రాణా వరకూ నెట్స్‌లో అందరూ చెమటోడ్చారు. గాయం నుంచి కోలుకొని ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన షమీ బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ సమక్షంలో తన లెంగ్త్‌ను సరిచేసుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాడు.
రోహిత్, కోహ్లీ, రాహుల్, గిల్, పాండ్యా సహా బ్యాటర్లంతా నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేశారు. అయితే, నెట్ సెషన్ కు ముందు గ్రౌండ్‌లో డ్రిల్స్ చేస్తుండగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది. నెట్ ప్రాక్టీస్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి వేగంగా వచ్చి తగలడంతో పంత్ నొప్పితో కింద పడిపోయాడు. వెంటనే ఫిజియో అతనికి ట్రీట్‌మెంట్ ఇచ్చాడు.
ఐస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత కుంటుతూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయిన పంత్ తర్వాత తిరిగి నెట్స్‌కు వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో తను కాస్త ఇబ్బందిగా కనిపించాడు. ఈ నెల 19న మొదలయ్యే మెగా టోర్నీలో ఇండియా తన మ్యాచ్‌లన్నీ
దుబాయ్‌లోనే ఆడనుంది.