అంతర్జాతీయ క్రికెట్కు జులన్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్కు జులన్ వీడ్కోలు

టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ సీనియర్ పేసర్ ఝలన్ గోస్వామి కెరీర్ కు గుడ్ బై చెప్పింది. ఇవాళ కెరీర్ లో లాస్ట్ ఇంటర్ నేషనల్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్​ తో మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా లార్డ్స్‌‌లో ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌‌ అనంతరం జులన్ సుదీర్ఘ కెరీర్‌‌కు గుడ్‌‌బై చెప్పింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా జులన్ కు ఘనంగా వీడ్కోలు పలికింది. మ్యాచ్ కు ముందు కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఝలన్ గోస్వామిని చూసి కంటతడి పెట్టింది. ఝలన్ ను హత్తుకొని ఏడ్చింది. తనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీసీసీఐ ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. 

జులన్ కెరీర్..

2002లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన జులన్..20 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతోంది. తన కెరీర్‌లో 12 టెస్టులు, 199 వన్డేలు, 71 టీ20 మ్యాచులు ఆడింది. టెస్టుల్లో 44 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఏకైక.. మొట్టమొదటి ఉమెన్  బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే 71 టీ20ల్లో 59 వికెట్లు దక్కించుకుంది. మొత్తంగా మూడు ఫార్మాట్లలో 350 వికెట్లు తీసింది. వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇవాళ చివరి మ్యాచ్ ఆడిన జులన్ 39 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికింది.