2401 రోజుల తర్వాత బరిలోకి ఇండియా ఉమెన్స్ జట్టు

2401 రోజుల తర్వాత బరిలోకి ఇండియా ఉమెన్స్ జట్టు
  • టెస్ట్​ మ్యాచ్​ బరిలో ఇండియా విమెన్స్​ టీమ్
  • నేటి నుంచి ఇంగ్లండ్​తో ఢీ    
  • మ. 3.30 నుంచి సోనీ టెన్‌‌‌‌1లో

ఒకటి, రెండు కాదు 2401 రోజుల లాంగ్​ బ్రేక్​. కరోనా దెబ్బకు మ్యాచ్​  ప్రాక్టీస్​ కూడా లేదు. పైగా.. ఆడేది ఫారిన్​ గ్రౌండ్​లో..!  ప్రత్యర్థి రెడ్​ బాల్​ క్రికెట్​తో టచ్​లోనే ఉన్నా.. భయమెరుగుని మిథాలీ రాజ్​ కెప్టెన్సీలోని ఇండియా విమెన్స్​ టెస్ట్​ సమరానికి సిద్ధమైంది.  నేడు మొదలయ్యే మ్యాచ్​లో ఇంగ్లండ్​ను వారి గడ్డపై ఢీ కొడుతోంది. హోమ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో ఆట ఇంగ్లిష్​ టీమ్​కు అడ్వాంటేజ్​ కాగా.. ఎక్స్​పీరియన్స్​ లేని ఇండియా ఎలా పెర్ఫామ్​ చేస్తుందో మరి! 

బ్రిస్టల్: దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా విమెన్స్​ టీమ్​ టెస్ట్​ చాలెంజ్​కు రెడీ అయ్యింది. బ్రిస్టల్​ వేదికగా బుధవారం మొదలయ్యే ఏకైక టెస్ట్ (నాలుగు రోజులు) మ్యాచ్​లో మిథాలీ రాజ్​ కెప్టెన్సీలోని ఇండియా విమెన్స్​ టీమ్​.. ఇంగ్లండ్​ విమెన్స్​ జట్టుతో తలపడనుంది. టీ20 వరల్డ్​కప్​ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం..కరోనా దెబ్బకు ఆటకు దూరమైన ఇండియా..ఇటీవల సౌతాఫ్రికాతో లిమిటెడ్​ ఓవర్​ ఫార్మాట్​ సిరీస్​లు ఆడింది. కానీ వాటిలోనూ ఓడిపోయి నిరాశపర్చింది. ఆ తర్వాత యూకే వచ్చిన మిథాలీ సేన..ఇప్పుడు రెడ్​ బాల్​ చాలెంజ్​కు సిద్ధమైంది. కరోనా ప్రోటోకాల్స్​ నేపథ్యంలో ఒక్క వామప్​​ మ్యాచ్​ కూడా ఆడని ఇండియా .. నెట్​ ప్రాక్టీస్​ను నమ్ముకుని నేరుగా బరిలోకి దిగుతోంది. పైగా, జట్టులో చాలా మందికి టెస్ట్ ఫార్మాట్​ అనుభవం లేకపోవడంతో ఒత్తిడంతా ఇండియాపైనే ఉంది. మరోపక్క ఇంగ్లండ్​ టీమ్​లో దాదాపు అందరూ లాంగ్​ ఫార్మాట్​తో టచ్​లో ఉన్నారు. అందువల్ల హోమ్​టీమ్​ ప్లేయర్లు కాన్ఫిడెంట్​గా బరిలోకి దిగనున్నారు.

షెఫాలీపై ఫోకస్
జట్టు విషయానికొస్తే..సొంతగడ్డపై జరిగిన సౌతాఫ్రికా సిరీస్​లో ఇండియా ప్లేయర్లంతా ఘోరంగా ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఆటకు దూరమైన ప్లేయర్లు మళ్లీ యూకేలోనే గ్రౌండ్​లోకి వస్తున్నారు. పైగా చాలా గ్యాప్​ తర్వాత టెస్ట్ ఆడనుండటంతో ఇండియాపైనే ఒత్తిడి ఉండనుంది. మంధాన, యంగ్​స్టర్​ షెఫాలీ వర్మ ఇన్నింగ్స్​ను స్టార్ట్​ చేయడం దాదాపు ఖాయమైంది. హార్డ్​ హిట్టర్​ షెఫాలీపై మేనేజ్​మెంట్​ చాలా ఆశలు పెట్టుకుంది. కెప్టెన్​ మిథాలీ, వైస్​ కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ , పూనమ్​ రౌత్​ మిడిలార్డర్​ భారాన్ని మోయనున్నారు. ఈ మ్యాచ్​ కోసం మెన్స్​ టీమ్​ వైస్​ కెప్టెన్​ రహానె నుంచి బ్యాట్స్​విమెన్​ టిప్స్​  తీసుకున్నారు. అవి వర్కౌట్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. స్పిన్​ బౌలింగ్​ ఆల్​రౌండర్​  దీప్తి శర్మ మిడిలార్డర్​లో కీలకం కానుంది. ఇక, జులన్​ గోస్వామి, శిఖా పాండే బౌలింగ్​ను నడిపించే చాన్సుంది. థర్డ్​ పేసర్​గా హైదరాబాదీ అరుంధతి రెడ్డికి చాన్స్​ రావొచ్చు. అయితే, సీనియర్లు జులన్​, శిఖా లాంగ్​ స్పెల్స్​ వేయగలరా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, సఫారీ సిరీస్​లో అట్టర్​ఫ్లాపైన స్పిన్నర్లకు ఈ మ్యాచ్​ కఠిన పరీక్షగా నిలవనుంది. కాగా, మ్యాచ్​ ప్రాక్టీస్​ లేకపోవడం వల్ల తమ ప్లేయర్లు ఈ మ్యాచ్​లో ఎలాంటి ప్రెజర్​ లేకుండా బరిలోకి దిగుతున్నారని ఇండియా మేనేజ్​మెంట్​ చెబుతోంది. మరి మిథాలీ అండ్‌‌‌‌ కో గ్రౌండ్​లో ఏం చేస్తుందో చూడాలి.

బలంగా ఇంగ్లిష్​ జట్టు..
షార్ట్​ ఫార్మాట్​తో పాటు  రెగ్యులర్​గా టెస్టులు ఆడుతున్న ఇంగ్లండ్​ ప్లేయర్లంతా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కెప్టెన్​ హెథర్​నైట్​, వైస్​ కెప్టెన్​ సీవర్, ఎకిల్​స్టోన్​, ష్రబ్​సోల్​ కీలక ప్లేయర్లు. పక్కా ప్లాన్​తోనే హోమ్​టీమ్​ బరిలోకి వస్తోంది. ఇండియా టెస్ట్ ఆడి చాలా కాలం అయినప్పటికీ వారిని తక్కువ అంచనా వేయమని సీవర్​ ఇప్పటికే చెప్పింది.

2401
2014 నవంబర్​లో చివరిగా ఓ టెస్ట్ ఆడిన ఇండియా విమెన్స్​ టీమ్​ 2401 రోజుల తర్వాత మళ్లీ బరిలోకి దిగుతోంది. రోజుల సంఖ్య పరంగా రెండు టెస్టుల మధ్య  ఇది మూడో పెద్ద బ్రేక్​. ఇదివరకు అత్యధికంఆ 2903 (2006  ఆగస్టు–2014 ఆగస్టు)​  రోజుల బ్రేక్​ తీసుకుంది. ఓసారి 2560 రోజుల(1977 జనవరి–1984 జనవరి)  పాటు టెస్టు క్రికెట్​ ఆడలేదు.

1
 ఈ మ్యాచ్​లో ఇండియా గెలిస్తే.. విమెన్స్​ క్రికెట్​లో వరుసగా నాలుగు టెస్ట్​ మ్యాచ్​లు గెలిచిన తొలి జట్టుగా నిలుస్తుంది.

2-1
ఇండియా, ఇంగ్లండ్​ మధ్య ఇప్పటిదాకా 13 టెస్టులు జరిగాయి. ఇండియా 2 విజయాలు సాధించగా, ఇంగ్లండ్​ ఒకటి గెలిచింది. మిగిలినవి డ్రా అయ్యాయి.

డ్యూక్స్​ కాదు కుకాబుర్రా...
ఇంగ్లండ్​లో జరిగే టెస్ట్​ మ్యాచ్​ల్లో సాధారణంగా రెడ్​ డ్యూక్స్​ బాల్​ను ఉపయోగిస్తారు. అయితే, ఇంగ్లండ్​ యాషెస్​ సిరీస్​ సన్నాహకాల్లో భాగంగా ఈ మ్యాచ్​లో కుకాబుర్రా బాల్​ను వాడుతున్నారు. ఇంగ్లిష్​ కండిషన్స్​లో కుకాబుర్రా బాల్​తో ఇండియా ప్లేయర్లకు పరీక్ష తప్పదని 
విశ్లేషకులు అంటున్నారు.

టీమ్స్‌‌‌‌ (అంచనా)
ఇండియా:  స్మృతి మంధాన,  షెఫాలీ వర్మ/ప్రియా పునియా, పూనమ్‌‌‌‌ రౌత్‌‌‌‌, మిథాలీ రాజ్​(కెప్టెన్​), హర్మన్​ప్రీత్​ కౌర్​(వైస్​ కెప్టెన్), దీప్తి శర్మ. తానియా భాటియా (కీపర్‌‌‌‌), జులన్​ గోస్వామి, శిఖా పాండే, పూనమ్‌‌‌‌ యాదవ్‌‌‌‌/ఏక్తా బిష్త్‌‌‌‌, అరుంధతి రెడ్డి/ పూజా వస్త్రాకర్‌‌‌‌.
ఇంగ్లండ్: టామీ బ్యూమోంట్‌‌‌‌, విన్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ హిల్‌‌‌‌, హెథర్‌‌‌‌ నైట్‌‌‌‌(కెప్టెన్‌‌‌‌), ఎమీ జోన్స్‌‌‌‌, సీవర్‌‌‌‌, సోఫియా డంక్లే, ఫ్రాన్‌‌‌‌ విల్సన్‌‌‌‌/ ఎల్విస్‌‌‌‌, కేథరిన్‌‌‌‌ బ్రంట్‌‌‌‌, అన్యా ష్రబ్‌‌‌‌సోల్‌‌‌‌, సోఫీ ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌, ఎమిలీ అర్లోట్‌‌‌‌/కేట్‌‌‌‌ క్రాస్‌‌‌‌.