
బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నలువల ఆకాశ్(23) ట్రైనింగ్‌లో భాగంగా రన్నింగ్ చేస్తూ డీహైడ్రేషన్ కు గురై చనిపోయాడు. మంగళవారం ఆయన డెడ్‌బాడీ స్వగ్రామం చేరుకోగా అంత్యక్రియలు నిర్వహించారు. ఇచ్చోడ నుంచి బంధువులు, స్నేహితులు, యువకులు త్రివర్ణ పతకాలతో వర్తమన్నూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆడేగామ, పిప్పిరి గ్రామాల మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ పాల్గొని జవాన్ కు నివాళులు అర్పించి, ఆయన ఫ్యామిలీకి రూ.50 వేల ఆర్థికసాయం అందించారు.