
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం సంభవించింది. సోమవారం (అక్టోబర్ 06) మిర్యాలగూడ దగ్గర రైలు ఆగిపోయింది. ఉదయం 9 గంటల తర్వాత రైలు ఆగిపోవటంతో ప్రయాణికులను మిర్యాలగూడ స్టేషన్ లో దింపివేశారు అధికారులు.
రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్-1పై గంటకు పైగా రైలు ఆగిపోవటంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తు్న్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ ఇంజిన్ లో సమస్య రావటంతో రైలును ఆపేశారు.
రామన్నపేట నుంచి మరో ఇంజన్ తెప్పించి రైలును నడిపించారు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఒక గంట సేపు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.