హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు కంపెనీ ప్రచారకర్తగా పనిచేస్తారు. ఈ సంస్థ రంగులు, పెయింట్స్ సర్వీసులు అందజేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వెయ్యికిపైగా ప్రాజెక్టులు పూర్తి చేసింది. యూత్ ఐకాన్‌గా మహేశ్ బాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కంపెనీకి మేలు చేస్తుందని సంస్థ తెలిపింది. భారత పెయింట్స్ రిటైల్ రంగంలో సుస్థిర స్థానం సంపాదిస్తామని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 వేల కోట్ల పెయింట్స్ పరిశ్రమలో 25 శాతం వాటాను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. రాబోయే12–18 నెలల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని, ఐదు వేల టచ్ పాయింట్స్‌తో అమ్మకాలను పెంచుకుంటామని తెలిపారు.
