ఫేస్​ బుక్​... చిన్న చిన్న  ఆనందాలు  వీటిలోనే..

ఫేస్​ బుక్​... చిన్న చిన్న  ఆనందాలు  వీటిలోనే..

ఎమోజీలు పెట్టడం, కొత్త స్టిక్కర్స్ కనిపెట్టడం, ఫ్రెండ్స్ లిస్ట్​ని ప్రైవేట్​గా ఉంచడం వంటివి చేస్తుంటారు చాలామంది. ఇలా ఫోన్​లో చేసేది చిన్న మార్పే! అయినప్పటికీ అది వాళ్లకు చాలా ఆనందాన్నిస్తుంది. అందుకే ఎమోజీలను ఇష్టపడేవాళ్లకు ఎమోజీ వాల్​ పేపర్స్ పెట్టే ఛాన్స్ వచ్చింది. కొత్త స్టిక్కర్స్​ కావాలనుకునే వాళ్లకు వాటిని యాడ్​ చేసుకునే అవకాశం కల్పించింది టెలిగ్రామ్​. అంతేకాదు.. ఫ్రెండ్స్ లిస్ట్​ని ప్రైవేట్​గా ఉంచేందుకు కొత్త అప్​డేట్​ తెచ్చింది ఫేస్​బుక్​

ఎమోజీ వాల్​పేపర్​ చేయడం ఈజీ

గూగుల్ పిక్సెల్, ఆండ్రాయిడ్14 బీటా యూజర్స్ ఇప్పుడు ఎమోజీ వాల్​పేపర్స్ క్రియేట్​ చేసుకోవచ్చు. ఇందులో సొంతంగా ఎమోజీ వాల్ పేపర్స్​ని క్రియేట్​ చేసుకునేందుకు ఎమోజీ వర్కషాప్ ఛాన్స్​ ఇచ్చింది. ఈ కొత్త వాల్​ పేపర్​ థీమ్​లో యూజర్స్,14కు పైగా ఎమోజీలను ప్రత్యేకమైన స్టయిల్, కలర్​ సెలక్ట్ చేసుకోవచ్చు. మొత్తంగా చూస్తే యునిక్​ బ్యాక్​గ్రౌండ్​తో అదరగొట్టేస్తుంది. ఇవి హోమ్​ స్క్రీన్​ పేజీల​ మీద పెట్టుకోవచ్చు. 

ఎలాగంటే.. 

ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్​లో ఎమోజీ వర్కషాప్​ని వాడి వాల్​పేపర్​ క్రియేట్​ చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్​ స్మార్ట్​ఫోన్​ లేదా ఏదైనా ఆండ్రాయిడ్ స్మార్ట్​ఫోన్​లో వాడడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో కావాలి. 

  • హోమ్​ స్క్రీన్​ మీద లాంగ్​ ప్రెస్​ చేయాలి. 
  • వాల్​ పేపర్, స్టైల్​​ మీద క్లిక్​ చేయాలి.
  • మోర్ వాల్​ పేపర్స్ సెలక్ట్ చేసుకోవాలి.
  • ఎమోజీ వర్క్​షాప్​ని సెలక్ట్ చేయాలి.

కావాల్సిన ఎమోజీల కోసం ఎడిట్​ ఎమోజీ ఆప్షన్​ క్లిక్​ చేయాలి. తర్వాత ప్యాటర్న్​, కలర్​సెలక్ట్ చేయాలి. 
ప్యాటర్న్​​ ట్యాబ్​ కింద ఉన్న స్లయిడర్​ని వాడి ఎమోజీ సైజ్, డెన్సిటీని అడ్జస్ట్​ చేయాలి.  
అన్నీ సెలక్ట్ చేసుకోవడం అయిపోయాక, సెట్ వాల్​ పేపర్​ మీద ట్యాప్ చేయాలి.

టెలిగ్రామ్​లో కొత్త స్టిక్కర్స్​

టెలిగ్రామ్ యూజర్స్​కి ప్రి – ఇన్​స్టాల్డ్​ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. కావాలనుకుంటే కొత్త స్టిక్కర్​ ప్యాక్స్ డౌన్​లోడ్ చేసుకోవచ్చు. అలాగే అప్పటికే ఉన్న కలెక్షన్​కి కొత్తవి కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇలా చేయాలి

  • టెలిగ్రామ్​ యాప్ ఓపెన్ చేసి, ఎడమవైపు పైన ఉన్న హాంబర్గర్​ మెను ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి.
  • తర్వాత సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి. అందులో చాట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్​ ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే, స్టిక్కర్స్, ఎమోజీలు కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకోవాలి. 
  • స్క్రీన్​ మీద కనిపిస్తున్న ట్రెండింగ్ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేయాలి. 
  • చివరిగా సెర్చ్​ బార్​లో నచ్చిన స్టిక్కర్​ ప్యాక్​ చూసి యాడ్​ అనే ఆప్షన్​ని సెలక్ట్​ చేయాలి. 

ఫ్రెండ్స్ లిస్ట్​ ప్రైవేట్​గా

ఫేస్​బుక్​లో కొందరు తమ ఫ్రెండ్స్​ లిస్ట్​ని ప్రైవేట్​గా ఉంచాలి అనుకుంటారు. యూజర్స్ తమ ఫ్రెండ్స్​ లిస్ట్​లో కొంతమందిని సెలక్ట్​ చేసుకోవచ్చు. 

ఏం చేయాలంటే... 

  • ఫేస్​బుక్​ యాప్​ ఓపెన్ చేసి, కుడివైపు పైన ఉన్న ప్రొఫైల్​ ఇమేజ్ ఐకాన్​ మీద ట్యాప్ చేయాలి. 
  • తర్వాత స్క్రోల్​ డౌన్ చేసి, సెట్టింగ్స్ & ప్రైవసీ మీద ట్యాప్ చేయాలి. అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్​ సెలక్ట్ చేసుకోవాలి. 
  • నెక్స్ట్ ఆడియెన్స్ అండ్ విజిబిలిటీ మీద ట్యాప్ చేసి, హౌ పీపుల్ ఫైండ్​ అండ్ కాంటాక్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. 
  • చివరిగా ‘హూ కెన్ సి యువర్ ఫ్రెండ్స్ లిస్ట్​?’ మీద ట్యాప్ చేసి, ఫ్రెండ్స్​ లిస్ట్​ స్క్రీన్​పై కనిపించే వాటిలో డిజైర్డ్​ ఆప్షన్ సెలక్ట్​ చేయాలి.
  • మ్యూచువల్ ఫ్రెండ్స్​ చూడొచ్చు. షేర్​ చేయొచ్చు కూడా.