గేమ్ టాస్క్ కంప్లీట్ చేయలేక టీనేజర్ సూసైడ్

గేమ్ టాస్క్ కంప్లీట్ చేయలేక టీనేజర్ సూసైడ్

ఆన్‌లైన్ గేమ్ కు అలవాటు పడ్డ ఒక టీనేజ్ కుర్రాడు.. గేమ్ లో టాస్క్ పూర్తి చేయడంలో విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన పాకిస్తాన్ లో జరిగింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని హింగర్‌వాల్ కు చెందిన 16 ఏళ్ల మహ్మద్ జకార్య ఇటీవలే పదవ తరగతి పూర్తి చేశాడు. జకార్య ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ పబ్జీకి బాగా అలవాటు పడ్డాడు. దాంతో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే ఉండేవాడు. మంగళవారం కూడా గేమ్ ఆడుతున్న జకార్య.. గేమ్ లో టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాడు. దాంతో డిప్రెషన్ కు లోనయి సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వచ్చిన సీనియర్ పోలీసు అధికారి గజన్ఫార్ సయ్యద్.. బాలుడి శరీరం దగ్గర పబ్జీ ఆట మధ్యలో ఉన్న ఒక ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు కోసం వెంటనే పంజాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ఏజెన్సీని పిలిపించినట్లు సయ్యద్ తెలిపారు.

‘జకార్య రోజుకు చాలా గంటలు PUBG ఆడటం వలన అది వ్యసనంగా మారింది. జకార్య తండ్రి కూడా చాలాసార్లు హెచ్చరించాడు. అయినా జకార్యలో మార్పు రాలేదు’ అని సయ్యద్ తెలిపారు. ఆన్‌లైన్ ఆటలకు సంబంధించి పంజాబ్ ప్రావిన్స్‌లో ఇది నాల్గవ ఆత్మహత్య. గతంలో మరో ఆన్‌లైన్ గేమ్ ‘బ్లూ వేల్ ఛాలెంజ్’కు బానిసలై దేశంలోని చాలా మంది యువకులు తమ ప్రాణాలను కోల్పోయారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు మూసివేత

బలవంతంగా పురుగుల మందు తాగించి..

ఆర్బీఐ పరిధిలోకి కో-ఆపరేటివ్ బ్యాంకులు

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి