సెల్‌తో సోలోగా గడిపేస్తున్న టీనేజర్స్

సెల్‌తో సోలోగా గడిపేస్తున్న టీనేజర్స్

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా చాటింగ్​, కాల్స్, పోస్ట్​లు, షేరింగ్​లతో ఆన్‌‌లైన్‌‌లో టైంపాస్​ చేస్తున్నారు చాలామంది. ఫోన్​లు, ల్యాప్​టాప్​లతో ఎక్కువసేపు ఉండడంతో మనుషుల మధ్య సంబంధాలు దూరమవుతున్నాయి. ఇలాంటి వాళ్లలో టీనేజర్స్​ ఎక్కువగా ఉన్నారని స్టడీలు చెబుతున్నాయి.

టీనేజర్స్​కి సెల్​ఫోన్​ ఉంటే చుట్టుపక్కల ప్రపంచంతో సంబంధం ఉండదు. నిమిషానికో ఫేస్​బుక్​ పోస్ట్​, గంటలకొద్దీ చాటింగ్​... అలా సెల్​ఫోన్​తో రాత్రి, పగలు తేడా లేకుండా గడిపేస్తున్నారు. ఫోన్​లలో కమ్యూనికేట్​ అవుతూ అందరితో కలుస్తున్నాం అనుకుంటారు. అలాంటి వాళ్లు సెల్​ఫోన్​, ల్యాప్‌‌టాప్‌‌ లేకపోతే లోన్లీగా ఫీలవుతున్నారు. టీనేజర్స్​ అయితే ఒక గదిలో కూర్చుని, సెల్​ఫోన్​తో తమని తాము లాక్ చేసుకుంటున్నారు. దీనివల్ల రోజురోజుకి వాళ్ల మెంటల్ హెల్త్​ దెబ్బతింటోంది​. అలాంటి వాళ్లు డిప్రెషన్​ బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. ఫ్యామిలీతో కలిసి డిన్నర్​కి వెళ్లినా.. అక్కడ కూడా సెల్ఫీలు, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లలో పోస్ట్​ పెట్టుకుంటూ ఫోన్​తో బిజీ అయిపోతున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా ఫ్రెండ్స్​తో ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుతుంటారు. ఫిజికల్ ఎక్సర్​సైజ్​లు లేకపోవడంవల్ల బాడీ ఫిట్​నెస్​ తగ్గిపోతుంది. మెంటల్​గానే కాకుండా ఫిజికల్​గా కూడా నష్టపోవాల్సి వస్తుంది. 

లిమిట్​గా వాడడం..
గతేడాదంతా లాక్‌‌డౌన్​ వల్ల ఇంటి నుంచి బయటికి రాకుండా, ఫ్రెండ్స్​ని, రిలేటివ్స్​ని కలవలేదు. ఇంట్లోనే ఉండి చాలా లోన్లీగా ఫీలయ్యారంతా. ఆ టైంలో సోషల్​ మీడియాని వాడారు చాలామంది. ఆన్​లైన్​లో​ కొత్త ఫ్రెండ్స్​ని వెతకడం కోసం డేటింగ్​ యాప్స్​​తో కమ్యూనికేట్​ అవుతున్నట్లు ఒక సర్వేలో తేల్చింది. 
ఈ సంవత్సరంలో లాక్​డౌన్​కు మూడు నెలల ముందు దేశవ్యాప్తంగా జరిగిన సర్వేలో 28శాతం మంది సింగిల్ ఇండియన్స్​ ఈ యాప్స్​ వాడుతున్నట్టు తెలిసింది. వీటికి దూరంగా ఉన్న కొందరు... ఫ్రెండ్స్​తో మాట్లాడేందుకు ఉపయోగపడుతున్నాయి. అలాగని గంటలకొద్దీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మెసేజ్​ పెడితే చాలు. కొందరైతే అది కూడా అక్కర్లేదు అంటున్నారు.
డబ్బులు ఖర్చు చేయొద్దు

  •   ఎవరితోనైనా చాటింగ్ చేసేటప్పుడు, ఇంటి అడ్రస్, ఆఫీస్​ వర్క్​ వంటి వివరాలు చెప్పకూడదు.
  •   చిన్నపిల్లలు తల్లిదండ్రుల​కి తెలియకుండా పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడొద్దు. వాళ్ల మెసేజ్​లకు రెస్పాండ్ అవ్వొద్దు.
  •   ఆన్​లైన్​ ఫ్రెండ్స్​ కోసం డబ్బులు ఖర్చు చేయొద్దు.
  •   అతిగా మాట్లాడకూడదు. సీక్రెట్స్ షేర్​ చేసుకోకూడదు. 
  •   ఆన్​లైన్​ ఫ్రెండ్స్​ని బయట కలవాలనుకుంటే, సేఫ్​గా ఉండే పబ్లిక్ ప్లేస్​లలోనే కలవాలి.

ఒంటరితనానికి చెక్

  • పది, పన్నెండేళ్ల పిల్లల్ని బయటికి వెళ్లి ఆడుకోనివ్వాలి. తల్లిదండ్రులు కాసేపైనా పిల్లలతో టైం స్పెండ్​ చేయాలి. 
  • పదిహేనేళ్లలోపు పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్​ ఎలా ఉంటారో నేర్పించాలి. ఈ వయసు​లో హెల్దీ ఫ్రెండ్​షిప్ అనేది చాలా ముఖ్యం​.
  • టీనేజర్స్​కి సెల్​ఫోన్​ ఇవ్వకపోవడం మంచిది.  లేదా సాయంత్రాలు కాసేపు ఇవ్వొచ్చు. రాత్రిళ్లు అస్సలు ఫోన్​ చేతికి ఇవ్వొద్దు. దానివల్ల త్వరగా నిద్రపోరు. అలసిపోతారు, యాంగ్జైటీగా ఫీలవుతారు.