మంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న

మంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న

మంచిర్యాల జిల్లా మందమరి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురు సజీవదహనం అయిన సంఘటనా స్థలాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మృతుని కుమారుడు సందీప్‭ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆరుగురు సజీవదహనం అయిన సంఘటన తనను కలిచివేసిందని అన్నారు. ఇందుకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ప్రభుత్వం తరఫున కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియాతో పాటు.. ఉండటానికి ఇల్లు, ఉద్యోగ సదుపాయం కల్పించాలన్నారు. తమ నుంచి బాధితుడికి రూ.50వేల రూపాయలను అందించామని చెప్పారు. బాధితుడికి ప్రభుత్వం అండగా ఉండకపోతే మూడు నెలల్లో తామే ఇల్లు కట్టించి ఇస్తామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. 

మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామంలో జరిగిన సజీవదహనం కేసు.. హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మృతుడు శివయ్య ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఇంట్లో పడుకున్నోళ్లు పడుకున్న చోటనే సజీవదహనం అయ్యారు. కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా డెడ్ బాడీలు కాలిపోయాయి. చనిపోయినోళ్లలో ఒకే కుటుంబానికి చెందినోళ్లు ఐదుగురు ఉండగా.. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.