'కాంతార'లోని వరాహ రూపం పాటకు తహసీల్దార్ డ్యాన్స్

'కాంతార'లోని  వరాహ రూపం పాటకు తహసీల్దార్ డ్యాన్స్

చిన్న సినిమాగా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కాంతార తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలోని వరాహ రూపం సాంగ్ మొత్తం మూవీకే ప్లస్ పాయింట్ గా నిలిచి, థియేటర్లలో సౌండ్ బాక్సులు దద్దరిల్లేగా చేసింది. దీంతో ఈ సాంగ్ పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో ఓ తహసీల్దార్ పాటకు తగ్గట్టు వేషం వేసి, అనుకరించిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన  పన్నుల శాఖ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొత్తవలస తహసీల్దార్ ప్రసాద రావు కాంతార సినిమాలో హీరో రిషబ్ శెట్టి చేసిన పాత్ర తరహాలో వేషం వేశారు. అదే తరహాలో వరాహ రూపం సాంగ్ కు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి వీక్షకులను కట్టిపడేశారు.

కాంతార సినిమాలోని పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసిన ప్రసాద రావు మొదటి బహుమతి గెలుచుకున్నందుకు గానూ నెటిజన్లు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన తహసీల్దార్ ప్రసాద రావుకు కళలంటే ఎంతో ఆసక్తి ఉండడంతో అందరిలాగానే ఇతనూ పాల్గొని, మంచి పేరు తెచ్చుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ ఈవెంట్ లో ప్రసాద రావు చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.