లాలూ కుమారుడి కంపెనీ ఉద్యోగి  డబ్బుతో  పరార్

V6 Velugu Posted on Sep 15, 2021

RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని నెలల క్రితం అగరబత్తీల వ్యాపారాన్ని ప్రారంభించారు.RL  అగరబత్తీ పేరుతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే.. అందులో పని చేస్తున్న ఉద్యోగి తేజ్ ప్రతాప్ ను మోసం చేశాడు. రూ. 71 వేల నగదు తీసుకుని పారిపోయాడు..

ఈ ఘటనపై ఎస్ కే పురి పోలీస్ స్టేషన్లో తేజ్ ప్రతాప్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తన కంపెనీలో మార్కెటింగ్ వ్యవహారాలు చూసే ఆశిష్ రంజన్ అనే వ్యక్తి రూ. 71 వేలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రంజన్ కోసం గాలింపు చేపట్టారు. రంజన్ పాట్నాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

Tagged Tej Pratap Yadav, Duped, Rs 71000, Company Staff

Latest Videos

Subscribe Now

More News