రాఘోపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలోకి తేజస్వీ.. తల్లిదండ్రుల సమక్షంలో నామినేషన్‌ దాఖలు

రాఘోపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి బరిలోకి తేజస్వీ.. తల్లిదండ్రుల సమక్షంలో నామినేషన్‌ దాఖలు

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌‌‌‌(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌‌‌‌ తన సొంత సెగ్మెంట్‌‌‌‌నుంచి బరిలోకి దిగారు. బుధవారం రాఘోపూర్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్‌‌‌‌ దాఖలు చేశారు. తన తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌‌‌‌ యాదవ్, రబ్రీదేవి సమక్షంలో ఆయన వైశాలి జిల్లాలో రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు నామినేషన్‌‌‌‌ పేపర్లు అందజేశారు. రాఘోపూర్‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న తేజస్వీ హ్యాట్రిక్‌‌‌‌ కొట్టాలని చూస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి తేజస్వి తల్లిదండ్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.