రైతుకు దెబ్బ మీద దెబ్బ... కరీంనగర్ లో గ్రానైట్ గుట్టలు కరిగిపోతున్నాయి..!

రైతుకు దెబ్బ మీద దెబ్బ... కరీంనగర్ లో గ్రానైట్ గుట్టలు కరిగిపోతున్నాయి..!

మొంథా తుఫాను బీభత్సం సృష్టించిందని... రైతుకు ప్రతి సారి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని  తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.  కరీంనగర్​ లో గ్రానైట్​ గుట్టలు కరిగిపోతున్నాయని ఆమె  ఆవేదన వ్యక్తం చేశారు. తుపాధి కోసం దుబాయ్​ వెళ్లిన తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని .. ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదన్నారు.  ఇంకా పలు విషయాల్లో మాట్లాడుతూ మహిళలకు రాజకీయాల్లో ఇంకా అవకాశాలు మెరుగుపడాలని కవిత అన్నారు.  

 కరీంనగర్ జిల్లాలో మెంథా  తుపానుతో నష్టపోయిన పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. తుపాను, నిరంతర వర్షాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి కొనుగోళ్లు జరగకపోవడం, వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుండటం లాంటి సమస్యలు రైతుల జీవితాలను దయనీయంగా మారుస్తాయని కవిత అన్నారు.

►ALSO READ | సోయా టోకెన్ కోసం రైతుల తిప్పలు..రాత్రంగా క్యూలైన్ లో పడిగాపులు

ధాన్యం మెులకలు వచ్చి, బూజు పట్టి, తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యం కూడా కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. . ఎకరాకు ప్రభుత్వం రూ.10 వేలు పరిహారం ఇస్తానంటోందని.. అది ఏ మూలకు సరిపోదన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.