
పెద్దపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు గురువారం డిల్లీలో ఘనంగా సన్మానించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం డిల్లీలో జరుగుతున్న ధర్నాలో పెద్దపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు, వివేక్ అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ సర్కార్‌లో న్యాయం చేయాలని మంత్రి వివేక్‌ను కోరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్, కందుల సదయ్య, జంగం కొమురయ్య, చందు, సమ్మయ్య, శ్రీమాన్, అల్లం సతీశ్, కొండి సతీశ్ పాల్గొన్నారు.