మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఫైనల్లో చికిత జోడీ

మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ ఫైనల్లో  చికిత జోడీ

బ్యాంకాక్: ఆసియా కప్ స్టేజ్-1 ఆర్చరీ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత అద్భుత పెర్ఫామెన్స్ చేస్తోంది. విమెన్స్ టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్ చేరిన ఆమె కాంపౌండ్ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ విభాగంలోనూ స్వర్ణ పతకం ముంగిట నిలిచింది. టాప్​ సీడ్లుగా బరిలోకి దిగిన చికిత–రజత్ చౌహాన్ జోడీ గురువారం జరిగిన  క్వార్టర్ ఫైనల్లో 159–-155తో చైనీస్ తైపీ ప్రత్యర్థులపై గెలిచింది.

 అనంతరం సెమీఫైనల్లో 157–-153తో కజకిస్తాన్ జట్టును  ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఫైనల్లో ఇండియాకే చెందిన ప్రథమేష్ జావ్‌‌‌‌‌‌‌‌కర్– ఉదయ్ కాంబోజ్  ద్వయంతో చికిత జోడీ తలపడనుంది. విమెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో హర్యానా ఆర్చర్ రిధి ఫోర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరగా.. రికర్వ్ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్ టీమ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో రుమా బిస్వాస్– దేవాంగ్ గుప్తా జోడీ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది.