కలెక్టరేట్ల ముందు ఆశా కార్యకర్తల ఆందోళన

కలెక్టరేట్ల ముందు ఆశా కార్యకర్తల ఆందోళన

వనపర్తి టౌన్/గద్వాల/నాగర్​కర్నూల్ టౌన్, వెలుగు : పెండింగ్  వేతనాలను వెంటనే చెల్లించాలని, అదనపు పనికి అదనపు పారితోషికం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం వనపర్తి, గద్వాల, నాగర్​కర్నూల్ లో తెలంగాణ ఆశా వర్కర్స్  యూనియన్  ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడిని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రెండు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి పని భారం తగ్గించాలన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.