మాతో టచ్లో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

మాతో టచ్లో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెప్పారు. చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని, ఈ నెల 10వ తేదీన గువ్వల బాలరాజు పార్టీలో చేరతారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. రానున్న రోజుల్లో చాలా మార్పులు ఉంటాయని, చాలా మంది పార్టీలో చేరతారని అన్నారు.

చాలా మంది నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. అందరు నాయకులనూ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. రేవంత్కు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే చిత్తశుద్ధి లేదన్నారు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదని, బీసీలకు ఇచ్చేది లేదని అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు.

►ALSO READ | జగ్గారెడ్డి కూతురు వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రి వివేక్