జగ్గారెడ్డి కూతురు వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రి వివేక్

జగ్గారెడ్డి కూతురు వివాహం.. వధూవరులను ఆశీర్వదించిన మంత్రి వివేక్

సంగారెడ్డి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి దంపతుల కూతురు జయారెడ్డి వివాహం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వధూవరులను ఆశీర్వ దించారు.  శుక్రవారం (ఆగస్టు 08) ఉదయం సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసానికి వెళ్లి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సంగారెడ్డి పర్యటనలో భాగంగా తోషిబా కంపెనీ కొత్త యూనిట్లను ప్రారంభించారు మంత్రి వివేక్. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో పూర్తయిన రెండు  మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను  మంత్రి వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి ప్రారంభించారు. దీంతో  పాటు  మరో రెండు కొత్త యూనిట్లకు భూమిపూజ చేశారు. అనంతరం జగ్గారెడ్డి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

►ALSO READ | రేవంత్‌, హరీష్‌ ఫోన్‌లు కూడా ట్యాప్‌.. హరీష్ ఆ భయంతో ఏడాది ఫోన్ వాడలే: బండి సంజయ్