ఐటీఐలో 6 కొత్త ట్రేడ్లు, 23 షార్ట్ టర్మ్‌‌‌‌‌‌‌‌ కోర్సులు

ఐటీఐలో 6 కొత్త ట్రేడ్లు, 23 షార్ట్ టర్మ్‌‌‌‌‌‌‌‌ కోర్సులు

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్స్ నేర్పించేందుకు, రాష్ట్రంలోని ఐటీఐలలో కొత్త ట్రేడ్లు, షార్ట్ టర్మ్ కోర్సులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌(ఎన్‌‌‌‌‌‌‌‌సీవీటీ) ఆమోదించిన ఆరు కొత్త ట్రేడ్లు, ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటనన్స్‌‌‌‌‌‌‌‌, రోబోటిక్స్‌‌‌‌‌‌‌‌, ఆటోమేషన్, సీఏడీ/సీఏఎం, సీఎన్‌‌‌‌‌‌‌‌సీ మెషీనింగ్, అడ్వాన్స్ ప్లంబింగ్, యాడిటివ్ మాన్యూఫాక్చరింగ్ వంటి 23 షార్ట్ టర్మ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవలే కేబినేట్ ఆమోదం తెలిపింది.

ఈ కోర్సుల్లో 9 వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఐటీఐలను నాణ్యమైన విద్య అందించేలా వాటిని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దశలవారీగా అన్ని ఐటీఐలను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేయాలని, ప్రతి ఐటీఐలో పది వేల ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌టీ సామర్థ్యంతో వర్క్‌‌‌‌‌‌‌‌షాపులను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం రూ.1984 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీకి ట్రైనింగ్​

తొలి దశలో 50 ఐటీఐలను అధికారులు ఎంపిక చేశారు. కొత్త ట్రేడ్లలో, కోర్సులలో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి 600 మంది ట్రైనర్లను నియమించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వర్క్‌‌‌‌‌‌‌‌షాపుల నిర్మాణం పూర్తి చేయాలని, అక్టోబర్ నుంచే కొత్త ట్రేడ్‌‌‌‌‌‌‌‌లలో స్టూడెంట్లకు అడ్మిషన్లు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఐటీఐల ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌, ఫాకల్టీకి ట్రైనింగ్ ఇవ్వడానికి మూడు నోడల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు  గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది.

ALSO READ: స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్సులకు జోనల్ అలకేషన్ ఉత్తర్వులువీవీపీ

కొత్త ట్రేడ్స్‌‌‌‌‌‌‌‌ ఇవే: 

1. ఆర్టిజన్ యూజింగ్
అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ టూల్
2. ఇండస్ట్రియల్ రోబోటిక్స్‌‌‌‌‌‌‌‌ అండ్ డిజిటల్ మాన్యూఫాక్చరింగ్
3. మాన్యూఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్
4. బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరీఫైడ్(మెకానికల్)
5. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ సీఎన్‌‌‌‌‌‌‌‌సీ మెషీనింగ్‌‌‌‌‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌‌‌‌‌
6. మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్స్