పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..దాదాపు 6 లక్షల మంది బాధితులకు ఆర్థిక భరోసా

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..దాదాపు 6 లక్షల మంది బాధితులకు ఆర్థిక భరోసా
  • 32 నెలల్లోనే రూ.2,750 కోట్ల సాయం పంపిణీ
  • బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇచ్చింది రూ.3,192 కోట్లే 

హైదరాబాద్, వెలుగు: కష్టకాలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కొండంత అండగా నిలుస్తోంది. తీవ్ర అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధులతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబాలకు సర్కారు అందిస్తున్న ఆర్థిక సాయం ఊరటనిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సాయం అందించింది.

అధికారంలోకి వచ్చిన 32 నెలల్లోనే రూ.2,750 కోట్లను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శక విధానంలో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నది. చికిత్స పూర్తయ్యాక ఇచ్చే రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కంటే.. ఆసుపత్రిలో చేరిన వెంటనే అత్యవసర చికిత్స అందేలా ఇచ్చే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) విధానానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేక ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పేదల కోసం ఎల్వోసీల రూపంలో రూ.914 కోట్లు ఖర్చు చేసింది.

దీంతో ముందస్తు డిపాజిట్ల భారం లేకుండా వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలకు నిమ్స్, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే, బసవతారకం వంటి ఆసుపత్రులకు ఎల్వోసీలు మంజూరు చేస్తున్నది. ప్రతినెలా సగటున రూ.80 కోట్లను సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ప్రభుత్వం విడుదల చేస్తున్నది.

పారదర్శకత కోసం సంస్కరణలు..

నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చే అర్జీలను అధికారులు పరిశీలించి చెక్కుల రూపంలో నిధులు విడుదల చేస్తున్నారు. గతంలో నెలల తరబడి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే దరఖాస్తులను రోజుల వ్యవధిలోనే ఆమోదిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పంపిణీ చేసిన మొత్తం రూ.3,192 కోట్లు మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం 32 నెలల్లోనే రూ.2,750 కోట్లను పేదల వైద్యానికి వెచ్చించి రికార్డు సృష్టించింది.

నిరుపేద చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే చెవుడు, మాటలు రాని సమస్యలను దూరం చేసేందుకు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ ఆసుపత్రిలోనూ సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్వోసీ సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లను ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎల్వోసీ మంజూరైన వెంటనే వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అనంతరం చిన్నారులకు స్పీచ్ థెరపీ, ఆడియాలజీ సేవలు కూడా అందిస్తున్నారు.

దీంతో పేద తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు చిన్నారులకు వినికిడి, మాటలు వచ్చే అవకాశం కలుగుతుండడంతో కొత్త జీవితం లభిస్తోంది. సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు పక్కదారి పట్టకుండా, దళారుల ప్రమేయం లేకుండా అర్హులకే అందేలా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాత మాన్యువల్ విధానానికి స్వస్తి పలుకుతూ దరఖాస్తుల స్వీకరణ నుంచి ఎల్వోసీ, చెక్కుల జారీ వరకు ప్రక్రియను పూర్తిగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ చేశారు. ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గ పరిధిలోని బాధితులకే సిఫార్సు లేఖలు ఇచ్చేలా నిబంధనలు పెట్టారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా నిధులు మంజూరు చేసే 'ఫస్ట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఫస్ట్ అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌' విధానాన్ని అమలు చేస్తున్నారు. చెక్కుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వాటిపై లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబర్లను ముద్రిస్తున్నారు. వివరాల సవరణలను కూడా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చేసేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది.