ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపుగా 40 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్, భట్టి భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు కొద్దిసేపటి క్రితమే మోడీతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
