తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‍కు కరోనా

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‍కు కరోనా

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‍ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం అయ్యారు. మూడ్రోజుల కింద సీఎం కేసీఆర్, కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాతో నిర్వహించిన మీటింగ్ లో సోమేశ్ పాల్గొన్నారు. కాగా, బీఆర్కేఆర్ భవన్ ఎస్పీఎఫ్ చీఫ్ త్రినాథ్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. 

ఇవ్వాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా తీవ్రతను నియంత్రించడంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, కోవిడ్ టెస్ట్ లు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, మండల స్థాయి అధికారులు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజువారి చేస్తున్న కొవిడ్ టెస్టులను పెంచాలని, పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను గుర్తించాలన్నారు. సంబంధితులను హోం ఐసోలేషన్ లో ఉంచాలని సూచించారు. హోమ్ ట్రీట్మెంట్ కిట్స్ ను పంపిణీ చేయాలని తెలిపారు.