టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు మంత్రి వివేక్కు ఆహ్వానం

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు మంత్రి వివేక్కు ఆహ్వానం
  • ఆగస్టులో అమెరికాలోని కాలిఫోర్నియాలో వేడుకలు

పద్మారావు నగర్, వెలుగు: తెలంగాణ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) తన 25వ వసంతాల వేడుకలను అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో నిర్వహించనుంది. ఈ వేడుకలకు రావాలని మంత్రి వివేక్ వెంకట స్వామిని టీడీఎఫ్- యూఎస్ఏ ఉపాధ్యక్షురాలు ప్రీతి చల్లా, టీడీఎఫ్- ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్‌‌‌‌‌‌‌‌ను మంత్రి వివేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

 రాష్ట్ర సాధన తర్వాత టీడీఎఫ్ జిల్లాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. టీడీఎఫ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ -ఇండియా చైర్మన్ గోనా రెడ్డి, సెక్రటరీ వినీల్ తదితరులు పాల్గొన్నారు.