
హైదరాబాద్, వెలుగు: వెటర్నరీ డాక్టర్ మర్డర్ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసు అధికారులను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఈ నెల 27న మిస్సింగ్ కేసు నమోదు చేసేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు స్టేషన్‌కు రాగా.. ఎఫ్ఐఆర్నమోదుకు పోలీసులు తీవ్ర కాలయాపన చేశారని ఉన్నతాధికారుల విచారణలో తేలింది. సంఘటన స్థలం తమ పరిధి కాదంటే, తమది కాదని ఆర్జీఐఏ పోలీసులు, శంషాబాద్ పోలీసులు తిప్పించారని తెలిసింది. దీంతో శంషాబాద్ ఎస్ఐ రవికుమార్, ఆర్జీఐఏ హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ గౌడ్లను సస్పెండ్ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమర్జెన్సీలో పరిధి చూడొద్దు..
అత్యవసర సమయాల్లో వచ్చే కేసులను పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధంలేకుండా కేసులు నమోదు చేసుకోవాలని కమిషనర్ సజ్జనార్ పోలీసు సిబ్బందికి సూచించారు.