ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ చేయాలి : లెల్లెల్ల బాలకృష్ణ

 ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ చేయాలి  : లెల్లెల్ల బాలకృష్ణ

కోడేరు, వెలుగు: జిల్లాలోని జల వనరుల్లో పెంచేందుకు మత్స్య సొసైటీలకు   చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని, ఇందుకు అవసరమైన డబ్బును మత్స్య సొసైటీ ఖాతాలో జమ చేయాలని తెలంగాణ మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సంఘం సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండిపోయాయని, అయినప్పటికీ నేటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లలు పంపిణీ చేయలేదన్నారు. తక్షణమే స్పందించి ఎలాంటి  టెండర్లు లేకుండా మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయని శాటిలైట్‌‌‌‌‌‌‌‌ సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.