బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతా

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతా

హైదరాబాద్​సిటీ, వెలుగు: పదవులతో సంబంధం లేకుండా తన సామాజిక సేవ కొనసాగుతుందని కాంగ్రెస్​నేత, తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, గౌడ్ హాస్టల్ మాజీ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అన్నారు. మల్కాజిగిరిలోని ఎస్​ఎస్​కే హాల్ లో ఆయన బర్త్​డే వేడుకలను అభిమానుల మధ్య జరుపుకున్నారు.

 లక్ష్మణ్ రావు గౌడ్ మాట్లాడుతూ ఎంతో మంది పేద విద్యార్థులను చదివించానని, గౌడ్ హాస్టల్ కు నాలుగు సార్లు, న్యూ క్లబ్ కు నాలుగు సార్లు అధ్యక్షుడిగా సేవలందించడం తన అదృష్టమన్నారు. తన జాతి అభివృద్ధితోపాటు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు. న్యూ క్లబ్ ముఖ్యులు ప్రశాంత్, ప్రేమ్, మాణిక్ రావు, ప్రవీణ్, సుందర్, నగేశ్, నాగేందర్, తెలంగాణ గౌడ్ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ఉపాధ్యక్షుడు బద్దం ధనుంజయ్, కార్యదర్శి డాక్టర్​ నోముల సిద్ధూ, నాయకులు భీష్మ,  నరేశ్, శ్రీనివాస్, రాములు, దేవేందర్, శ్రీనివాస్, మహేందర్, యాశీల్ , శ్రీధర్ పాల్గొన్నారు.