
- పెండింగ్ చార్జీల చెల్లింపుల కోసం ప్రత్యేక మాడ్యూళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనధికార, చట్టవిరుద్ధ లేఔట్‌ల రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అనప్రూవ్డ్ అండ్ ఇల్లీగల్ లేఔట్ రూల్స్-2020 ప్రకారం రిఫండ్‌లు, పెండింగ్‌లో ఉన్న 14% ఓపెన్ స్పేస్ చార్జీల చెల్లింపుల కోసం ప్రత్యేక డిజిటల్ మాడ్యూళ్లను అభివృద్ధి చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మాడ్యూళ్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ ) సమన్వయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిఫండ్ ప్రక్రియను పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు ప్రత్యేక డిజిటల్ మాడ్యూల్‌ను రూపొందించనున్నారు.