- గతంలో రూ.12.67 కోట్లు
- తాజాగా రూ.5.66 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
యాదాద్రి, వెలుగు: జిల్లాలో వడ్ల కొనుగోలులో కీలకపాత్ర పోషిస్తున్న ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్‌పీవోలకు కమీషన్ రిలీజ్అయింది. 2023-–24 ఫైనాన్షియల్ఇయర్లో యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా సంఘాలకు ఒకేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ వచ్చింది.
దళారుల ప్రమేయం లేకుండా..
వడ్ల కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రతీ సీజన్లో వందలాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్, ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవోలు), మార్కెట్ కమిటీలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఇదివరకు ఎక్కువగా పీఏసీఎస్‌ల పాత్ర కీలకంగా ఉండగా.. 2025 వానాకాలం సీజన్ నుంచి మహిళా సంఘాల నేతృత్వంలో నడిచే ఐకేపీ సెంటర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. 50 శాతానికి పైగా కొనుగోళ్లు ఐకేపీ సెంటర్లలోనే జరుగుతున్నాయి. మిగతా వడ్లను పీఏసీఎస్, ఎఫ్‌పీవో, మార్కెట్కమిటీల ఆధ్వర్యంలో కొంటున్నారు.
కమీషన్ మొత్తం రూ.18.34 కోట్లు
వడ్లు కొనుగోలు చేస్తున్న ఆయా సంఘాలకు క్వింటాల్‌కు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తోంది. ఇలా ప్రతీ సీజన్లో వాటికి రూ.కోట్లలో కమీషన్ అందుతోంది. దీంతో మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లు, ఎఫ్‌పీవోలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. 2023–-24 వానాకాలం, యాసంగిలో 5.73 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు. ఈ రెండు సీజన్లలో ఆయా సంఘాలు కొనుగోలు చేసిన వడ్లకు సంబంధించి రూ. 18,34,32,370 కమీషన్ వచ్చింది.
6 నెలల కింద మొదటి విడత..
ఐకేపీ, పీఏసీఎస్, ఎఫ్‌పీవోలకు గతేడాదికి సంబంధించిన కమీషన్ మొత్తం రూ.18.34 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం 6 నెలల కింద మొదటి విడతగా రూ. 12,67,47,000 రిలీజ్ చేసింది. తాజాగా మిగతా రూ.5,66,85,370 కమీషన్చెల్లించింది.
