
- పసుపు బోర్డు, అగ్రికల్చర్ వర్సిటీకి ల్యాండ్ కేటాయిస్తాం
- గవర్నమెంట్ అడ్వైజర్ షబ్బీర్అలీ
నిజామాబాద్, వెలుగు: పదేండ్లు విధ్వంసక పాలన చేసిన బీఆర్‌ఎస్‌తో ప్రజలు పడ్డ ఇబ్బందులు ఒక్కొక్కటి తొలగిస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్‌లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి మీటింగ్నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ, 9వ డివిజన్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు.
బీఎన్‌ఎల్ గార్డెన్‌లో పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మాజీ సీఎం కేసీఆర్కూతురిగా కవిత కూడా జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని షబ్బీర్అలీ విమర్శించారు. జిల్లాలో పసుపు బోర్డు ఆఫీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన ల్యాండ్ప్రతిపాదనలు ఆఫీసర్ల నుంచి గవర్నమెంట్‌కు అందితే అలాట్చేయిస్తామన్నారు. అర్బన్‌లో 1300 మందికి ఇండ్లు మంజూరు చేశామని మరో 2200 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ ఇండ్లు ఇస్తున్నం– టీపీసీసీ ప్రెసిడెంట్‌మహేశ్ గౌడ్
బీఆర్ఎస్ సర్కార్ చేసిన రూ.7.50 లక్షల కోట్ల అప్పుల భారంమోస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ ఇతర హామీలు అమలు చేస్తున్నామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్తెలిపారు. బీఆర్ఎస్ గవర్నమెంట్చేసిన అప్పులపై నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తూ మహిళలకు ఫ్రీ బస్, ఉచిత కరెంట్, రుణమాఫీ, రైతుభరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం స్కీమ్‌లు అమలు చేస్తున్నామన్నారు. సొంత జాగా ఉన్న ప్రతి అర్హతగల కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోడానికి రూ.5 లక్షలు ఇస్తామని ఎవరూ దళారులను ఆశ్రయించొద్దన్నారు.
గవర్నమెంట్ ల్యాండ్ ఫైనల్ అయ్యాక ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి కేటాయిస్తుందన్నారు. ఇందుకోసం భూములు పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, రాకేశ్ రెడ్డి, స్టేట్మినరల్ డెవలప్మెంట్కార్పొరేషన్చైర్మన్ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, స్టేట్ కోఆపరేటివ్డెవలప్మెంట్లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్అంతిరెడ్డి రాజిరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక కమిషనర్దిలీప్కుమార్ఉన్నారు.