గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కృష్ణమోహన్ రెడ్డిపై న్యాయస్థానం వేటు వేసింది. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యేగా గుర్తించింది. కృష్ణమోహన్ రెడ్డికి రూ.3 లక్షల జరిమాన విధించింది. ఇందులో రూ.50వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశించింది. 

కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదని.. అదే విధంగా ఓట్ల ఎన్నికల సమయంలో వీవీ పాడ్స్ కు సంబంధించిన చీటీలను సరిగా లెక్కించలేదంటూ.. హైకోర్టులో రెండు పిటీషన్లు దాఖలు చేశారు డీకే అరుణ. ఈ రెండు పిటీషన్లను విచారించిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని నిర్థారణకు వచ్చి.. ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని.. డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ ఈసీని ఆదేశించింది హైకోర్టు.