Vyooham Movie: వ్యూహం రిలీజ్పై హైకోర్టు స్టే..తీర్పు ఎప్పుడంటే?

Vyooham Movie: వ్యూహం రిలీజ్పై హైకోర్టు స్టే..తీర్పు ఎప్పుడంటే?

రామ్ గోపాల్ వరం వ్యూహం (Vyooham) సినిమా‌ రిలీజ్ కు బ్రేక్ పడింది. వ్యూహం సిన్మాను సంక్రాంతి పండుగకు రిలీజ్‌ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని సినిమా నిర్మాత తరఫు లాయర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు రిలీజ్ పై స్టే విధించింది. ఈ నెల జనవరి 22న తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. పిటిషనర్, ప్రతివాదులు కలిసి ఏర్పాటు చేసుకున్న కమిటీకి వ్యూహం సినిమాను చూపించాలని, సినిమాపై రిపోర్ట్ ను కోర్ట్ కు సమర్పించాలనీ హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. 

వ్యూహం రిలీజ్ను ఆపాలంటూ..సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని..అంతేకాకుండా చంద్రబాబు వ్యక్తిత్వాన్ని..అతని కుటంబాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ మూవీ రిలీజ్ చేయొద్దని నారా లోకేశ్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 

 2023 నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన వ్యూహాన్ని..ముందుగా సెన్సార్ బోర్డు రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందో..లేదో తెలియక..వర్మ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. ఇక కోర్టు తీర్పు వెలువడే వరకే ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పదు.