ప్రియాంక నేరుగా పోలీసులకు ఫోన్ చేయాల్సింది:మహమూద్ అలీ

ప్రియాంక నేరుగా పోలీసులకు ఫోన్ చేయాల్సింది:మహమూద్ అలీ

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్యపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ విచారం వ్యక్తం చేశారు.  నేరాల్ని అరికట్టేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారన్న మహమూద్ అలీ.. అంత పెద్ద చదువు చదివిన ప్రియాంక..తన సోదరికి ఫోన్ చేయకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ప్రియాంక కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఆమె తల్లిదండ్రులు  విమర్శిస్తున్నారు. కేసు పెట్టేందుకు స్టేషన్ కు వెళితే ..ఈ కేసు తమపరిధిలోకి రాదని పోలీసులు చెప్పారని, తక్షణమే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని ప్రియాంక పేరెంట్స్ విమర్శిస్తున్నారు.