అమెరికా పర్యటనకు ఐటీ మంత్రి కేటీఆర్

అమెరికా పర్యటనకు ఐటీ మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన  అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 29 వరకు కొనసాగనున్న పర్యటనలో.. ప్రముఖ కంపెనీలను సందర్శిస్తారు. అమెరికాలో మొదట లాస్  ఏంజిల్స్ నుంచి మంత్రి కేటీఆర్ పర్యటన ప్రారంభం కానుంది. 20న శాండియాగో, 21న శాన్  జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్ లో కొనసాగనుంది. ఈ పర్యటనలో ఆయన పలు ప్రముఖ కంపెనీల అధిపతులు, సీఈవోలతో సమావేశం కానున్నారు.

తన అమెరికా పర్యటన గురించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఐదేండ్ల తర్వాత ఇవాళ వర్క్ ట్రిప్ కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలిపారు. రానున్న వారమంతా చాలా బిజీగా, తీరిక లేకుండా మీటింగ్స్ కు అటెండ్ కావాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఇంజినీరుగా రిటైరైనంక.. ‘గేట్’ ర్యాంక్ కొట్టిండు

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్