తెలంగాణ జాబ్ స్పెషల్ : సార్క్​.. బ్రిక్స్​.. బిమ్​స్టెక్​

తెలంగాణ జాబ్ స్పెషల్ : సార్క్​.. బ్రిక్స్​.. బిమ్​స్టెక్​

పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ సంబంధాల టాపిక్​ అత్యంత కీలకమైంది. ఈ టాపిక్​ నుంచి జనరల్​ స్టడీస్​లో 8–10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్​–1, ఎస్​ఐ, కానిస్టేబుల్​ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వశ్చన్స్​ కంపల్సరీ వచ్చే  సార్క్​, బిమ్​స్టెక్​, ఆసియన్​, బ్రిక్స్​, షాంఘై  సహకార సంస్థల్లో భారత్​ పాత్ర గురించి తెలుసుకుందాం. 

దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి/ సమాఖ్య(సార్క్) 

దక్షిణాసియా ప్రజలు స్నేహం, పరస్పర నమ్మకం, విశ్వాసం, అవగాహనతో పనిచేయడానికి సార్క్ ఒక వేదికగా 1985 డిసెంబర్ 8న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయాన్ని నేపాల్ రాజధాని ఖాట్మండులో 1987 జనవరి 16న ఏర్పాటు చేశారు. ప్రారంభంలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు సభ్య దేశాలుగా ఉండేవి. 2007లో ఆప్ఘనిస్తాన్ సభ్యదేశం హోదా పొందింది. ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణకొరియా, అమెజాన్, యురోపియన్ యూనియన్ దేశాలు పరిశీలక దేశాలుగా ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వాన దేశం దక్షిణాఫ్రికా. దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి ఆయా విషయాలపై సాంకేతిక కమిటీలను సార్క్ నియమించి ఆ అంశాల పురోభివృద్ధికి దోహదపడుతుంది. వ్యవసాయం గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య- జనాభా, స్త్రీలు- యువత- పిల్లలు, పర్యావరణం- అడవులు, శాస్త్రసాంకేతిక విజ్ఞానం- వాతావరణ పరిశోధన, మావన వనరుల అభివృద్ధి, రవాణా, సమాచారం- వార్తా- సౌకర్యాలు, బయోటెక్నాలజీ, మేధోపరమైన ఆస్తిహక్కులు, పర్యటన, ఇంధనంపై కమిటీలను ఏర్పాటు చేశారు. 

సార్క్ వ్యవసాయ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? (ఎ)
ఎ. ఢాకా బి. ఖాట్మాండు సి. ఇస్లామాబాద్ డి. న్యూఢిల్లీ
సార్క్ ఏర్పాటైన సంవత్సరం? (ఎ)
ఎ. 1985 డిసెంబర్ 8        బి. 1986 డిసెంబర్ 8 
సి. 1985 డిసెంబర్ 9     డి. 1985 డిసెంబర్  10

బంగాళాఖాత తీర దేశాల బహుళార్థ సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థ(BIMSTEC)

బంగాళాఖాతం చుట్టు ఉన్న దేశాల మధ్య పరస్పర సహకారం, అవగాహన పెంచడానికి బిమ్‌‌స్టెక్‌‌ను 1997 జూన్ 6న స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఢాకాలో ఉంది. ప్రారంభ దేశాలు బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్(BIST-EC), 2022 డిసెంబర్ 1997లో మయన్మార్ చేరడంతో (BIMST-EC), 2004లో నేపాల్, భూటాన్ చేరడంతో BIMSTECగా మారింది. ఈ ప్రాంతీయ సమూహం మొదట బ్యాంకాక్‌‌లో బీఐఎస్‌‌టీ-ఈసీ(బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్)గా ఏర్పడింది.  ఈ సమూహాన్ని అప్పటి నుంచి బంగాళాఖాత తీర దేశాల బహుళార్థక సాంకేతిక, ఆర్థిక సహకార సంస్థగా పిలుస్తున్నారు. బిమ్‌‌స్టెక్ దేశాల మధ్య వాణిజ్య, రవాణా సంబంధాలను పెంపొందించడానికి 2005లో ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) భాగస్వామిగా మారింది. సార్క్, ఏషియన్ కూటముల మధ్య బిమ్‌‌స్టెక్ కూటమి వారధిలా సహకరిస్తుంది. 

బిమ్‌‌స్టెక్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? (డి)


ఎ. థాయిలాండ్     బి. మయన్మార్ 
సి. ఇండియా     డి. ఢాకా


బిమ్‌‌స్టెక్ ప్రధానంగా 14 రంగాలలో పరస్పర సహకారాలను ప్రోత్సహిస్తుంది. ఒక్కో రంగం బాధ్యతను ఒక్కో సభ్యదేశానికి కేటాయించారు. వ్యాపార-పెట్టుబడి రంగం, వాతావరణ మార్పు- బంగ్లాదేశ్, శక్తి వనరులు, వ్యవసాయం- మయన్మార్, సాంకేతిక రంగం- శ్రీలంక, మత్స్య సంబంధ రంగం, ప్రజారోగ్యం, ప్రజల మధ్య ఇంటరాక్షన్- థాయిలాండ్, దారిద్ర్య నిర్మూలన- నేపాల్, సంస్కృతి- భూటాన్, పర్యాటక రంగం, ఉగ్రవాద నిర్మూలన, నేరాలను తగ్గించుట, పర్యావరణం, సహజ విపత్తు యాజమాన్యం- ఇండియా. బిమ్‌‌స్టెక్ మొదటి సమావేశం బ్యాంకాక్‌‌లో 2004, జులై 31న జరిగింది. ఐదో సమావేశం 2022 మార్చి 30న కొలంబోలో జరిగింది.  


బిమ్‌‌స్టెక్ దేశాల మధ్య పరస్పర సహకారం కోసం రవాణా, కమ్యూనికేషన్ రంగాన్ని ఏ దేశానికి కేటాయించారు?(సి)
ఎ. మయన్మార్     బి. నేపాల్ 
సి. ఇండియా         డి. థాయిలాండ్

ఆగ్నేయాసియా దేశాల సంస్థ(ఆసియన్)

ప్రాంతీయ భద్రత ద్వారా జాతీయ భద్రతను లేదా జాతీయ భద్రత ద్వారా ప్రాంతీయ భద్రతను సాధించేందుకు ఆసియన్‌‌ను 1967 ఆగస్టు 8న బ్యాంకాక్‌‌లో స్థాపించారు. ఇది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికపరమైన సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. వ్యవస్థాపక దేశాలైన ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ ఆసియా స్థాపనకు ఉద్దేశించిన పత్రంపై సంతకాలు చేశాయి. ఈ పత్రాన్ని ఆసియన్ ప్రకటనగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం 10 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రూనెదారుస్సలాం, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా కొత్తగా చేరాయి. ఆసియన్ రాజకీయ, భద్రత సంస్థ, ఆసియన్ ఆర్థిక సమాజం, ఆసియన్ సామాజిక, సాంస్కృతిక సమాజం ఆసియన్ ప్రధాన విభాగాలు ఆసియన్ మొదటి సమావేశం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. 39వ సదస్సు బ్రూనైలో 2021 అక్టోబర్ 26–28 మధ్య నిర్వహించారు. ఆసియన్ థీమ్ ఒకే దృష్టి, ఒకే ఏకత్వం, ఒకే సమాజం. 1997లో ఆసియన్ + 3(చైనా, జపాన్, దక్షిణకొరియా)ను ఏర్పాటు చేశారు. 

ఆసియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? (ఎ)
ఎ. జకార్తా బి. మనీలా సి. హనోయి డి. సింగపూర్

బ్రిక్స్

బ్రిక్స్‌‌ను 2009లో స్థాపించారు. సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా. ఈ ఐదు దేశాల కూటమి బ్రిక్స్. ఈ కూటమి మొదట బ్రిక్‌‌గా ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్ కూటమిగా రూపాంతరం చెందింది. కూటమిలోని దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వైజ్ఞానిక తదితర రంగాల్లో పరస్పర సహాయ సహకారాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఏర్పాటైంది. బ్రిక్స్ మొదటి సమావేశం 2009 జూన్‌‌లో రష్యాలోని యెకటేరిన్ బర్గ్‌‌లో జరిగింది. 13వ బ్రిక్స్ సమావేశం 2021 సెప్టెంబర్ 9న న్యూఢిల్లీలో వర్చువల్‌‌గా జరిగింది. 14వ బ్రిక్స్ సమావేశం జూన్ 24న చైనాలో జి జిన్‌‌పింగ్ నగరంలో జరగనుంది. 

బ్రిక్స్‌‌లో చేరిన చివరి సభ్య దేశం? (డి) 
ఎ. ఇండియా బి. చైనా సి. న్యూఢిల్లీ డి. దక్షిణాఫ్రికా

షాంఘై సహకార సంస్థ 

షాంఘై సహకార సంస్థను 1996లో ప్రాంతీయ భద్రతను ఉద్దేశించి ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం బీజింగ్‌‌లో ఉంది. అధికార భాషలు చైనీస్, రష్యన్. సభ్యదేశాలు చైనా, కజికిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. ఈ సంస్థలో ఉజ్బెకిస్తాన్ చేరడానికి పూర్వం షాంఘై-ఫైవ్ అని పిలిచేవారు.  పరిశీలక దేశాలు ఆప్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా. ఇది ప్రారంభంలో కేవలం భద్రతాపరమైన అంశానికే పరిమితమైంది. ప్రస్తుతం సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక రంగాలలో పరస్పర సహకారంతోపాటు అభివృద్ధి సాధించడంలో క్రియాశీలక పాత్ర వహిస్తుంది. 2015 జులై 10న పాకిస్తాన్, ఇండియా పూర్తిస్థాయి సభ్యదేశాలుగా    చేరేందుకు తీర్మానం చేశారు. 2017 జూన్ 9 నుంచి పూర్తిస్థాయి సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. మొదటి సమావేశం 2001 జూన్ 14న షాంఘైలో జరిగింది.  22వ సమావేశం సెప్టెంబర్ 15-------–16 మధ్య ఉజ్బెకిస్తాన్‌‌లోని సమర్‌‌ఖండ్‌‌లో నిర్వహించనున్నారు. 

షాంఘై సహకార సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?(డి)
ఎ. ఢాకా         బి. ఇస్లామాబాద్ 
సి. తాష్కెంట్     డి. బీజింగ్


సార్క్ మొదటి సమావేశం 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. 1991లో శ్రీలంక రాజధాని కొలంబోలో సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా(ఎస్‌‌ఏఫ్‌‌టీఏ) ఒప్పందం రూపొందించడానికి ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్‌‌(ఐజీజీ)ను ఏర్పాటు చేశారు. 1993లో ఐజీజీ ఆమోదించబడి, 1995 డిసెంబర్ 7న అమలులోకి వచ్చింది. సార్క్ సభ్యదేశాల మధ్య దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం, పరస్పర సహకార లక్ష్యంతో రాయితీల మార్పిడి ద్వారా వాణిజ్య, ఆర్థిక సహకారం అందించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. 2004లో ఇస్లామాబాద్‌‌లో 12వ సార్క్ సమ్మిట్​లో ఎస్‌‌ఏఫ్‌‌టీఏ ఏర్పాటుకు  సభ్యదేశాలు నిర్ణయించారు. ఈ ఒప్పందం 2006 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది.