
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ అజాద్ ఇంజనీరింగ్, జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్‌తో 53.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.452 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద న్యూక్లియర్, థర్మల్ పవర్ ఇండస్ట్రీల కోసం ఎయిర్‌ఫాయిల్స్ (తిరిగే, స్థిరమైన బ్లేడ్‌లు) ను సరఫరా చేస్తుంది.
ఈ ఒప్పందం ఆరేళ్ల పాటు (2030 వరకు) ఉంటుందని, అధునాతన న్యూక్లియర్, ఇండస్ట్రియల్, థర్మల్ పవర్ ఇండస్ట్రీల కోసం క్లిష్టమైన, అధిక నాణ్యత గల ఎయిర్‌ఫాయిల్స్‌ను తయారు చేసి, సరఫరా చేస్తామని అజాద్ ఇంజనీరింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిని తయారు చేయడానికి కంపెనీ ఇటీవల 7,600 చదరపు మీటర్లలో ఓ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.