
న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ డైరెక్షన్ చాలావరకు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, విదేశీ పెట్టుబడిదారుల ట్రేడింగ్, కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్‌పై ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. పహల్గాం టెర్రర్ దాడి వల్ల భారత్-–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌పై కూడా ట్రేడర్లు ఫోకస్ పెట్టాలి. గత వారం, యూఎస్‌తో ట్రేడ్ ఒప్పందం జరిగే అవకాశం ఉండడం, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా మారడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 1,289 పాయింట్లు (1.62 శాతం) పెరగగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 307 పాయింట్లు (1.27 శాతం) లాభపడింది. కానీ, రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ వార్‌తో గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్‌లో కదులుతుండడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ వారం మాక్రో ఎకనామిక్ డేటాలో, హెచ్‌ఎస్‌బీసీ సర్వీసెస్ పీఎంఐ డేటా విడుదల కానుంది.
టారిఫ్ వార్, పాకిస్తాన్‌తో రాజకీయ ఉద్రిక్తతలపై అప్‌డేట్స్‌పై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టాలని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు. మే 7న యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనుందని తెలిపారు. ఎం అండ్ ఎం, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎల్‌అండ్ టీ, టైటాన్ రిజల్ట్స్ ఈ వారం వెలువడనున్నాయి.
ఏప్రిల్‌లో రూ.4,223 కోట్ల పెట్టుబడులు..
మూడు నెలల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారిన ఎఫ్‌ఐఐలు, ఈ ఏడాది ఏప్రిల్‌లో నికరంగా రూ.4,223 కోట్లను మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇండియా ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడంతో తిరిగి ఇండియా వైపు చూస్తున్నారు.