డిమాండ్లు తీర్చకపోతే ఎల్లుండి నుంచి పూర్తి సేవలు బంద్

డిమాండ్లు తీర్చకపోతే ఎల్లుండి నుంచి పూర్తి సేవలు బంద్

గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీని అమలుచేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు నేటి నుంచి ఆందోళన బాట పట్టారు. ఎమర్జెన్సీ, కరోనా ఐసీయూ వార్డులు మినహా మిగతా డ్యూటీలు బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు తీర్చకపోతే ఎల్లుండి నుంచి మొత్తం సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈనెల పదో తేదీనే జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంట్స్‌కు 15 శాతం జీతాలు పెంచాలంటున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్‌లో చెప్పినట్లుగా 10 శాతం ఇన్సెటివ్స్ వెంటనే చెల్లించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కరోనా బారినపడిన జూడాలు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జూడాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని డీఎంఈ రమేశ్ రెడ్డి చెప్పారు. ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.