శిల్పకు గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌

శిల్పకు గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ పవర్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ (డబ్ల్యూపీసీ) నేషనల్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ లిఫ్టర్లు అదరగొట్టారు. ఈ నెల 12 నుంచి 15 వరకు బెంగళూరులో జరిగిన పోటీల్లో మూడు గోల్డ్‌‌‌‌, రెండు సిల్వర్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తో మెరిశారు. అండర్‌‌‌‌–90 కేజీ కేటగిరీలో శిల్ప 105 కేజీల బరువు ఎత్తి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలవగా, ఇందు 100 కేజీల బరువు లిఫ్ట్‌‌‌‌ చేసి సిల్వర్‌‌‌‌ను సొంతం చేసుకుంది.

అండర్‌‌‌‌–70 కేటగిరీలో తర్షియా (తెలంగాణ) 115 కేజీలతో స్వర్ణాన్ని సాధించింది. ఎన్‌‌‌‌. సౌమ్యకు సిల్వర్‌‌‌‌ లభించింది. అండర్‌‌‌‌–110 కేటగిరీలో శ్రుతి 130 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని అందుకుంది.