
జగిత్యాలలో ఓ ప్రేమ జంట పురుగు మందు తాగి, చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈ దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం గ్రామ శివారులో జి.ప్రణీత్ చారి (21), రమ్య (21) అనే ఇద్దరు ప్రేమికులు పురుగు మందు తాగి ఉరి వేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ప్రణీత్ మరణించాడు. ఉరి వేసుకున్న తాడు నుంచి మృతదేహం కిందపడిపోయింది. అయితే అప్పటికీ కొన ఊపిరితో ఉన్న రమ్య తండ్రికి ఫోన్ చేసింది. హుటాహుటీన ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని, ఆస్పత్రికి తరలించాడు. అయితే అక్కడ చికిత్స పొందుతూ రమ్య మరణించింది. ప్రణీత్, రమ్యల ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వారు ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.