బిట్​ బ్యాంక్​ .. తెలంగాణ మలిదశ ఉద్యమం

బిట్​ బ్యాంక్​ ..   తెలంగాణ మలిదశ ఉద్యమం
  •     తెలంగాణ సమస్యలపై అధ్యయనం చేసేందుకు 1985లో విద్యావంతుల సదస్సు కరీంనగర్​లో ఏర్పాటైంది. 
  •     1986లో తెలంగాణ ఇన్ఫర్మేషన్​ ట్రస్టు ఏర్పడింది. 
  •     1980వ దశకంలో తెలంగాణ సమస్యలపై మా తెలంగాణ మాస పత్రిక ప్రారంభమైంది. 
  •     1989లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద స్థాయిలో చర్చ జరిగింది.
  •     1989లో తెలంగాణ అభివృద్ధి ఫోరం  వివిధ కార్యక్రమాలు చేపట్టింది.
  •     1991లో తెలంగాణ స్టూడెంట్స్​, తెలంగాణ లిబరేషన్​ ఫ్రంట్​ సంస్థల ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక ఆందోళనలు జరిగాయి. 
  •     తెలంగాణ స్టూడెంట్స్​ ఫ్రంట్​ కాకతీయ విశ్వవిద్యాలయశాఖ 1992లో ఏర్పడింది. 
  •     1992లో తెలంగాణ సమస్యలపై అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రభుత్వానికి తెలంగాణ ఇంజినీర్ల సంఘం సమర్పించింది. 
  •     1993, ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చిన్న రాష్ట్రాలపై జాతీయ సదస్సు జరిగింది. 
  •     1993, ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన చిన్న రాష్ట్రాలపై జాతీయ సదస్సులో జార్జి ఫెర్నాండెజ్​ ప్రసంగించారు. 
  •     తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో 1996లో వరంగల్​లో జరిగిన సదస్సులో తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజా పార్టీ సంస్థలు ఆవిర్భవించాయి
  •     1997, డిసెంబర్​లో అఖిల భారత ప్రజాప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో  సమరయోధుడు, కవి కాళోజీ నారాయణ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు జరిగింది.
  •     1998లో ప్రొఫెసర్​ జయశంకర్​ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది.
  •     మాజీ మంత్రి ఇంద్రారెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడింది.
  •     1999లో అమెరికాలోని న్యూయార్క్​లో తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ అనే ఉద్యమ సంస్థ ఏర్పడింది.
  •     తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన భువనగిరి సదస్సు 1997, మార్చి 8,9 వ తేదీల్లో జరిగింది. 
  •     భువనగరిలోని ఇండియా మిషన్​ స్కూల్​ ఆవరణలో 1997, మార్చి 8, 9వ తేదీల్లో జరిగిన సదస్సులో కాళోజీ నారాయణరావు ప్రధాన వక్తగా వ్యవహరించారు. 
  •     భువనగిరి సదస్సులో పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బహుజన రిపబ్లిక్​ పార్టీ అధ్యక్షుడు కె.జి.సత్యమూర్తి డిమాండ్​ చేశారు. 
  •     వరంగల్​ డిక్లరేషన్​ విడుదల చేసిన వరంగల్​ సదస్సు 1997లో జరిగింది. 
  •     ప్రత్యేక రాష్ట్ర సాధనకు ప్రజలను సమాయత్తం చేయాలని వరంగల్​ డిక్లరేషన్ పిలుపు ఇచ్చింది. 
  •     1956–90 మధ్య వ్యవసాయ కూలీల సంఖ్య ఆంధ్ర ప్రాంతంలో ఒక్క శాతం పెరగగా, తెలంగాణ ప్రాంతంలో 30శాతం నుంచి 47శాతానికి పెరిగింది.
  •     ప్రత్యేక తెలంగాణ కోసం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేసే విషయం ఆలోచించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ 2001, ఏప్రిల్​లో తీర్మానం చేసింది.
  •     610 జీవో అమలు తీరును పరిశీలించడం కోసం 2001, జూన్​ 25న ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం గిర్​గ్లాని కమిషన్​ ఏర్పాటు చేసింది.
  •     గిర్​గ్లాని కమిషన్​  తన నివేదికను ప్రభుత్వానికి 2004, సెప్టెంబర్​లో సమర్పించింది. 
  •     610 జీవో అమలులో 18 రకాల ఉల్లంఘనలు జరిగినట్లు గిర్​గ్లాని కమిషన్​ పేర్కొంది. 
  •     వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్న వారందరితో చిన్న రాష్ట్రాల సమాఖ్య ఏర్పడింది. 
  •     2004లో కరీంనగర్​లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ పార్టీ నెరవేరుస్తుందని విస్పష్టంగా ప్రకటించారు. 
  •     యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో 2004, జూన్​ 7న చేర్చింది. 
  •     తెలంగాణ అంశంపై విస్తృత అంగీకారం కోసం  యూపీఏ ప్రభుత్వం 2005లో ప్రణబ్​ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘాన్ని నియమించింది. 
  •     ప్రణబ్​ ముఖర్జీ ఉపసంఘానికి తెలంగాణకు అనుకూలంగా దేశంలోని 36 పార్టీలు లేఖలు ఇచ్చాయి. 
  •     తెలంగాణలో ఉద్యమం తిరిగి పుంజుకోవడానికి హైదరాబాద్​ ఫ్రీజోన్​ అని కోర్టు ఇచ్చిన తీర్పు దోహదం చేసింది.
  •     2010, డిసెంబర్​లో జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ నివేదికను సమర్పించింది. 
  •     కేంద్ర ప్రభుత్వం జస్టిస్​ శ్రీకృష్ణ కమిటీ నివేదికను 2011, జనవరి 6న బహిరంగపరిచింది.
  •     హైదరాబాద్​తో కూడిన 10 జిల్లాల తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీ 2013, జులై 30న ప్రకటించింది. 
  •     తెలంగాణపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2013, అక్టోబర్​ 8న ఎ.కె.ఆంటోని చైర్మన్​గా గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​ను ఏర్పాటు చేసింది.
  •     తెలంగాణ ముసాయిదా బిల్లును 2013, డిసెంబర్​ 5న కేంద్ర కేబినెట్ఆమోదించింది. 
  •     యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్​సభలో 2014, ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టింది.
  •     రాష్ట్ర పునర్​ వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో 2014, ఫిబ్రవరి 20న ప్రవేశపెట్టారు. 
  •     తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014, జూన్​ 2ను 2014, మార్చి 4న ప్రకటించారు. 
  •     కాంగ్రెస్​ నేత జానారెడ్డి కన్వీనర్​గా 1990లో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశారు. 
  •     చిన్నారెడ్డి కన్వీనర్​గా తెలంగాణ లెజిస్లేటివ్​ ఫోరం ఏర్పాటైంది.
  •     ముఖ్యమంత్రి వై.ఎస్​.రాజశేఖర్​రెడ్డి తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు సేకరించడానికి 2008లో రోశయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
  •     1997లో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తెలంగాణకు అనుకూలమని బీజేపీ అగ్రనేత వాజ్​పేయి ప్రకటించారు. 
  •     భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు – రెండు రాష్ట్రాలు నినాదంతో 1997లో కాకినాడ తీర్మానం చేసింది.
  •  
  • ALSO READ :బ్యాంక్​ ఆఫ్​ ఇండియా లాభం 1,458 కోట్లు