తెలంగాణ లేకుండా ఇండియా మ్యాప్ .. మంత్రి నారా లోకేష్కు అందజేసిన మాధవ్పై విమర్శలు

తెలంగాణ లేకుండా ఇండియా మ్యాప్ .. మంత్రి నారా లోకేష్కు అందజేసిన మాధవ్పై విమర్శలు

హైదరాబాద్, వెలుగు: ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గురువారం అందజేసిన ఇండియా మ్యాప్ లో తెలంగాణ లేకపోవడం వివాదాస్పదమవుతోంది. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా నియమితులైన  మాధవ్ ఏపీ మంత్రి లోకేష్​ను గురువారం అమరావతిలో కలిశారు. 

ఈ సందర్భంగా ‘భారత సంస్కృతిక వైభవం’ పేరుతో ఉన్న అఖండ భారత దేశ చిత్రపటాన్ని లోకేష్​కు బహూకరించారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇందులో వివిధ దేశాలతో పాటు అన్ని రాష్ట్రాలు విభజించి, పేర్లతో సహా ఉన్నప్పటికీ  తెలంగాణ లేకుండా ఉమ్మడి ఏపీని చూపించడంపై విమర్శలు వస్తున్నాయి.