ప్రారంభమైన ఫస్ట్ ఫేజ్ పరిషత్ పోలింగ్

ప్రారంభమైన ఫస్ట్ ఫేజ్ పరిషత్ పోలింగ్

తెలంగాణ పరిషత్ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ మొదలైంది. మొదటి విడతలో 195 జడ్పీటీసీలు, 2,097 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. సగటున ఒక్కో జడ్పీటీసీ సీటుకు నలుగురు, ఒక్కో ఎంపీటీసీ సీటుకు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో సాయంత్రం సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్  జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ సిబ్బంది ఓటరుకు బ్యాలెట్‌ పత్రాలు వేర్వేరుగా ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్ ఇస్తారు. ఆ ఓటు వేసి వచ్చిన తర్వాత జడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్ ఇస్తారు. ఎంపీటీసీ బ్యాలెట్‌ పేపర్ గులాబి రంగులో, జడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్ తెలుపు రంగులోను ఉంటాయి.