భగీరథ తెచ్చినా నీళ్ల కష్టాలు తీరుతలే

భగీరథ తెచ్చినా నీళ్ల కష్టాలు తీరుతలే
  • లీకులు, మెయింటెనెన్స్ ​లోపాలతో ట్యాంకులకు ఎక్కని వాటర్ 
  • వందలాది గ్రామాలు, పట్టణాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి 
  • పల్లెల్లో పాత​బోర్లు, పట్టణాల్లో ట్యాంకర్లతో అరకొరగా సప్లై​ 
  • రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు 
  • ఎప్పట్లాగే నెత్తిన బిందెలతో బోర్లు, వాగుల బాట పడ్తున్న మహిళలు 
  • టౌన్లలో ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూపులు

వెలుగు, నెట్ వర్క్: రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ స్కీం తెచ్చినా ప్రజల గొంతు తడవడం లేదు. వేసవిలో ఆడబిడ్డలకు ఎప్పట్లాగే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కెడు నీటి కోసం పల్లెల్లో బిందెలు పట్టుకొని వ్యవసాయ బావులు, వాగుల వైపు వెళ్తున్నారు. పట్టణాల్లో ట్యాంకర్ల కోసం గంటలకొద్దీ ఎదురుచూస్తున్నారు. మిషన్​భగీరథ ద్వారా ఇంటింటికీ 24 గంటలు నీళ్లిస్తున్నామని సర్కారు పెద్దలు చెప్తున్నా వేలాది గ్రామాల్లో వారానికోసారి కూడా వాటర్ రావడం లేదు.

నగరాలు, పట్టణాల్లోనూ రెండు, మూడు రోజులకోసారి అరగంట, గంటకు మించి నల్లా నీళ్లు వస్తలేవు. దీంతో ఆగ్రహిస్తున్న పబ్లిక్.. వారం, పదిరోజులుగా ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగుతున్నారు. మిషన్​భగీరథ పనులు చాలా చోట్ల పూర్తికాకపోవడం, పూర్తయిన చోట్ల మెయింటెనెన్స్ లోపాలు, సరిపడా ప్రెజర్​లేక ట్యాంకులకు వాటర్ ఎక్కకపోవడంలాంటి సమస్యలే ఇందుకు కారణమని ఆఫీసర్లు అంటున్నారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లపై ఆశలు వది లేసుకుంటున్న సర్పంచులు, పాత బోర్లకు రిపేర్లు చేసి నీళ్లిస్తున్నారు. కానీ అవి తాగేందుకు పనికిరాకపోవడంతో జనం మినరల్​వాటర్​ తెచ్చుకుంటున్నారు. పట్ట ణాల్లోనూ పబ్లిక్ గోస చూడలేక ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నామని మున్సిపల్​ఆఫీసర్లు చెప్తున్నారు. 

ఇంకా సగం ఇండ్లకు కనెక్షన్లు లేవ్ 

96 నియోజకవర్గాల్లోని 24 వేల హాబిటేషన్లకు 24 గంటల పాటు వాటర్ సప్లై చేయాలనే లక్ష్యంతో 2016లో మిషన్​భగీరథ స్కీం చేపట్టారు.  ఇందుకోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారు. మెయి న్ ట్రంక్​లైన్లు పూర్తిగా, ఇంట్రా పైపులైన్లు 95 శాతానికి పైగా కంప్లీట్​అయ్యాయని మూడేండ్లుగా సర్కారు చెబుతోంది. రూరల్ ఏరియాల్లో 55.95 లక్షల ఇం డ్లకు, పట్టణ ప్రాంతాల్లో 12.83 లక్షల ఇండ్లకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా, ఫీల్డ్​ లెవల్​లో ఓవర్​హెడ్ ట్యాం కులు, ఇంట్రాపైపులైన్లు పూర్తికాకపోవడంతో ఇంకా సగానికి పైగా ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వలేదని ఆఫీసర్లే చెప్తున్నారు. 

మెయింటెనెన్స్, డిశ్చార్జిలో లోపాలు 

భగీరథ స్కీంలో ట్రంక్ లైన్లతో పాటు మేజర్ డిస్ట్రిబ్యూటరీ పనులను మేఘా, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ, ఐహెచ్ పీ, మాక్స్ ఇన్ ఫ్రా సహా పలు ఏజెన్సీలు దక్కించుకున్నాయి. పైపులైన్ పనులు చేసిన ఏజెన్సీలే  పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీలకు సరిపడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టాఫ్ లేక ఫీల్డ్ లెవల్​లో సమస్యలు వస్తున్నాయి. క్వాలిటీ లేని పైపుల్లో కెపాసిటీకి మించి వాటర్ పంపుతుండడంతో ప్రెజర్ పెరిగి, పగుళ్లు, లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఇది ఒక సమస్య అయితే వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్లలో రేయింబవళ్లు మోటార్లను నడపడం వల్ల తరచూ రిపేర్ కు వస్తున్నాయి. ఏజెన్సీలు వీటిని ఎప్పటికప్పుడు రిపేర్​చేయకపోవడం వల్ల ఒకటి, రెండు మోటార్లు దెబ్బతిన్నా  పైపుల్లో ఫోర్స్ తగ్గి చివరి హ్యబిటేషన్లకు వాటర్​ రీచ్ కావట్లేదని చెబుతున్నారు. ఇక మెయిన్ గ్రిడ్ తోపాటు ఇంట్రాపైపులైన్లు ఎక్కడ పగిలినా, లీకయినా 48 గంటల్లో రిపేర్ చేయాల్సి ఉన్నప్పటికీ రెండు, మూడురోజులకుపైగా పడుతోంది. మళ్లీ వాటర్ ఫ్లో అందుకొని చివరి హ్యాబిటేషన్లకు చేరేందుకు వారం, పదిరోజులు పడుతోందని అంటున్నారు. నిజానికి ప్రతి వాటర్ ట్యాంకును రోజుకు రెండు సార్లు నింపాలి. రాత్రి పంప్​చేసిన వాటర్​ను ఉదయం, మధ్యాహ్నం పంప్​చేసిన వాటర్​ను సాయంత్రం రిలీజ్​చేసేలా భగీరథ స్కీం డిజైన్ చేశారు. ఫోర్స్ తక్కువగా ఉండడం తో రోజుకు ఒకసారి ట్యాంకులు నింపలేకపోతున్నారు.   

 ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి 

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల్లోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే భగీరథ నీళ్లు వస్తుండడంతో ఇంద్రవెల్లి మండలంలో దొడంద, చిలాటిగూడ, సాలేగూడ, ఖైరుగూడలో బావుల నుంచి, చెలిమెల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో 26 వార్డులు ఉండగా, 20 వార్డులకు భగీరథ నీళ్లు రావడంలేదు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గొపేర, గోవేనా, నాగు గూడ, కొలాం గూడ, మంగి, తాటి గూడ, కేరె గూడ, పంగిడి మదర, మాగుర్ మోడీ, గుడిపేట, కోర్లోంకా, మార్క గూడ తదితర గ్రామాల్లో 20 రోజులకోసారి నీళ్లు వస్తుండడంతో మహిళలు ఎప్పట్లాగే బిందెలు పట్టుకొని బావుల నుంచి తెచ్చుకుంటున్నారు.   

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీతోపాటు మండలంలోని డి.ధర్మారం, రాయిలాపూర్, కాట్రియాల్, అక్కన్నపేట, ఝాన్సీలింగాపూర్ కు సరిపడా నీరు అందడం లేదు. ఝాన్సీ లింగాపూర్ లో నెల రోజులుగా భగీ రథ నీళ్లు రాక ట్యాంకర్ల ద్వారా సప్లయ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్), అక్కన్నపేట మండలం జనగామలో పైపులైన్లు వేయకపోవడంతో భగీరథ నీళ్లు అందడంలేదు.  


కరీంనగర్‌‌ జిల్లా  చొప్పదండి మండలానికి 20 రోజులుగా భగీరథ వాటర్ నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా డబ్బా వద్ద ఏర్పాటుచేసిన గ్రిడ్​లో ఆరు మోటార్లకుగాను మూడు మొరాయించడంతో మెట్ పల్లి మండలం లోని 25 గ్రామాలకు భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి.

వరంగల్ సిటీలో లీకేజీల సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతం చిన్న, పెద్ద కలిపి దాదాపు వెయ్యి వరకు లీకేజీలున్నట్లు  సిబ్బంది చెబుతున్నారు. వాల్వ్​ల రిపేర్లు, లీకేజీల కారణంగా నీటి సరఫరాకు అం తరాయం ఏర్పడుతోంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తాపూర్​ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రెండు, మూడు రోజులకోసారి నల్లా నీరు వస్తోందని జనం అంటున్నారు. ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లిలో భగీరథ నీళ్లు రాకపోవడంతో కొద్దిరోజుల కింద స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే రాజయ్యను నిలదీశారు. మ హబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డులకు భగీరథ నీళ్లు అందడం లేదు.  ఇటీవల 25 వ వార్డులోని ధర్మన్న కాలనీవాసులు మున్సిపల్ ఆఫీసు ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.

నల్గొండ జిల్లా నందికొండ, హాలియా, మిర్యాలగూడ పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగాఉంది. నాగార్జునసాగర్ సెగ్మెంట్​లోని తండాల్లో మిషన్ భగీరథ నీళ్లు వారానికి ఒకరోజు కూడా రావడంలేదు. పెద్దవూర మండలం పాల్తీ తండావాసులు ఊరి చివర బావుల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొ స్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట, పెన్ పహాడ్, చివ్వెంల మండలాల్లోని ట్యాంకులకు మిషన్​భగీరథ నీళ్లు ఎక్కడం లేదు. దీంతో లోకల్ బోర్ల ద్వారా అరకొరగా సప్లై చేస్తున్నారు. సూర్యాపేటలో నీళ్లు లీక్​ అవుతున్నాయి. 

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో10 వేల జనాభా ఉన్నప్పటికీ ఇక్కడి పబ్లిక్ నేటికీ భగీరథ నీళ్ల మొహం చూడలేదు. దీంతో పాత ట్యాంక్ కు గ్రామ పంచాయతీ మోటార్ తో నింపి, కొన్ని ఇండ్లకు సప్లయ్ చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీవాసులకు మిషన్ భగీరథ నీరు అందని ద్రాక్షగా మారింది. పట్టణంలో నాలుగైదు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. చండ్రుగొండ మండలంలోని మహ్మద్ నగర్, మద్దుకూరు గ్రామాలకు భగీరథ నీళ్లు అందడం లేదు. ఏజెన్సీలో వందలాది గుత్తికోయ గ్రామాలకు చెలిమెనీరే దిక్కవుతోంది.

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో10 రోజులకోసారి అరగంట పాటు భగీరథ నీళ్లు వస్తు న్నాయి. జిల్లాకేంద్రంలో గతంలో రోజు విడిచి రోజు గంట పాటు నీళ్లిచ్చేవారు. ప్రస్తుతం రెండు రోజుల కోసారి అరగంటే ఇస్తున్నారు. ప్రెజర్ రాకపోవడంతో శివారు ప్రాంతాలకు చేరడం లేదు. అడ్డాకుల, మూ సాపేట మండలాలకు భగీరథ నీళ్లు అందక పంచా యతీ బోర్ల నుంచే రోజుకు అరగంట పాటు నీటిని సప్లై చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సగం వార్డులకు భగీరథ వాటర్ అందడం లేదు. నాలుగు వార్డులకు బోరు నీళ్లే దిక్కవుతున్నాయి. 

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిషన్ భగరీథ స్కీం పూర్తికాకపోవడంతో ప్రజలు మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీలో ఐదేండ్ల కింద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కొంత వర్క్ చేసి ఫండ్స్ రాక చేతులెత్తేశాడు. దీంతో రెండేండ్ల కింద తిరిగి టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్​కు అప్పగించారు. ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో మున్సిపాలిటీకి పాత స్కీం ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. చాలాచోట్ల రెండు మూడు రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. దీంతో పట్టణంలోని పలు కాలనీలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు.

ఉప్పు నీళ్లు తాగుతున్నం 

నాలుగేండ్ల కింద ఆఫీ సర్లు మా ఇంటికి వచ్చి నల్లా బిగించిండ్రు. రోజూ ఫిల్టర్ నీళ్లు వస్త యని చెప్పిండ్రు. కానీ, కొన్ని రోజులే ఫిల్టర్ నీళ్లు వదిలిండ్రు. మూడేండ్లు అయితాంది. ఇప్పటి దాకా నీళ్లు రావడం లేదు. సర్పంచ్​ను మస్తు సార్లు అడిగినం. ట్యాంక్ ఎత్తున్న చోట కట్టినర్రని , నీళ్లు ఎక్కువ తలేవని చెబుతాండు.  
- భీమమ్మ పాత ఎస్సీ కాలనీ, వెన్నాచెడ్ గ్రామం, గండీడ్ మండలం, మహబూబ్​నగర్ జిల్లా

భగీరథ నీళ్లు ట్యాంకులకు ఎక్కుతలేవ్

మా ఊరిలోని ట్యాం కులకు భగీరథ నీళ్లు ఎక్కుతలేవు. ట్యాంకు లు ఎత్తులో ఉండడం, ప్రెజర్ తక్కువ రావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిం ది. దీంతో పబ్లిక్​ఇబ్బంది పడకూడదని గ్రా మంలోని పలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వాటర్​సప్లై చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఎండలు ముదిరితే ఆ నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది.

- అశోక్, సర్పంచ్, మరిమడ్ల, కోనరావుపేట మండలం, సిరిసిల్ల జిల్లా

మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్ గ్రామంలో నాలుగేండ్ల కింద ఆఫీసర్లు భగీరథ కనెక్షన్ ఇచ్చి, నల్లాలు ఫిట్ చేశారు. ఇకపై ప్రతి రోజూ ఫిల్టర్ వాటర్ వస్తాయని చెప్పడంతో గ్రామస్తులు సంతోషించారు. కానీ, మొదట్లో కొన్ని రోజులు మాత్రమే నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత మూడేండ్లుగా నల్లాల్లో చుక్కా నీళ్లు రావడం లేదు. ట్యాంక్​ను బాగా ఎత్తయిన ప్రాంతంలో కట్టడం వల్లే నీళ్లు ఎక్కడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. దీంతో మహిళలు బావులు, బోర్ల దగ్గర నీళ్లను తెచ్చుకుంటున్నారు.