తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్

V6 Velugu Posted on Oct 07, 2020

తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారన్నారు హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ. ఇవాళ(బుధవారం) శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో  సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను   బలోపేతం చేశారన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పోలీసులు ప్రజల కోసం అంకింత భావంతో పనిచేశారన్నారు. వారి కుటుంబాలను కూడా వదిలి సమాజాన్ని కాపాండేందుకు పోలీసులు ముందుకొచ్చారని గుర్తు చేశారు.

ఆ తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న 450మంది కానిస్టేబుళ్ల కు మంత్రి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి,  సీపీ అంజనీ కుమార్ లు పాల్గొన్నారు.

Tagged telangana police, number one, Home minister, mahmood ali, Country

Latest Videos

Subscribe Now

More News